Sunday, May 4, 2025
- Advertisement -

వీరభద్రస్వామి ఆలయంకి ఎన్టీఆర్ భారీ విరాళం

- Advertisement -

జూనియర్ ఎన్టీఆర్ మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. కోనసీమ జిల్లా చెయ్యేరులోని శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆలయానికి రూ.12.5 లక్షల భారీ విరాళం అందించారు ఎన్టీఆర్. తన కుటుంబ సభ్యుల పేర్లతో ఆలయ నిర్మాణానికి విరాళం అందించారు. ఈ ఆలయాన్ని సందర్శించిన కొంతమంది ఈ సమాచారాన్ని షేర్ చేయడంతో సోసల్ మీడియాలో వైరల్‌గా మారింది. శిలా ఫలకంపై ఎన్టీఆర్‌తో ఆయన భార్య ప్రణతి, కుమారుల పేర్లతో పాటు తల్లి పేరు కూడా ఉంది.

ప్రస్తుతం రెండు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు ఎన్టీఆర్. కొరటాల శివ దర్శకత్వంలో దేవర మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ నెల 20 ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా.. ఫస్ట్ సింగిల్‌ను మే 19న రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించారు. రెండు పార్టులుగా ఈ సినిమా తెరెక్కుతోంది.

అలాగే అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో వార్2 లో నటిస్తున్నారు. హృతిక్ రోషన్ మెయిన్ లీడ్ రోల్‌లో నటిస్తుండగా.. ఎన్టీఆర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా కోసం ముంబైలో జరుగుతున్న షూటింగ్‌లో పాల్గొంటున్నారు ఎన్టీఆర్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -