ఏ హీరోకైనా లోకల్ లో క్రేజ్ ఎంత ఉన్న బయట కూడా ఎంతోకొంత ఉంటేనే పాపులారిటీ పెరిగేది. సౌత్ లో అన్నీ భాషల్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న హీరోగా సూపర్ స్టార్ రజినీకాంత్ కి తిరుగు లేని ఇమేజ్ ఉంది. ఒక్క సౌత్ లోనే కాకుండా ఇండియా వైడ్ గా ఫేమస్ అయిన రజినీకాంత్ కి జపాన్ లాంటి పరదేశంలో కూడా భారీ ఫాలోయింగ్ వచ్చేలా చేశాయి ఆయన సినిమాలు.
జపాన్ లో రజినీకాంత్ క్రేజ్ ను చూసి చాలామంది హీరోలు ఆ క్రేజ్ ను సొంతం చేసుకోవాలని ట్రై చేసినా ఎవ్వరికీ సొంతం కాలేదు. కానీ అనుకోకుండా ఎన్టీఆర్ నటించిన సినిమాలకు అక్కడ క్రేజ్ పెరగడం జరిగింది. దాంతో రజినీకాంత్ తరువాత అక్కడ పాపులారిటీ దక్కించుకున్న రెండో సౌత్ ఇండియన్ హీరోగా మారాడు ఎన్టీఆర్.
కాగా ఇప్పుడు ఎన్టీఆర్ నటిస్తున్న కొత్త సినిమా జనతాగ్యారేజ్ అక్కడ కూడా ఆగస్టు 12 నే రిలీజ్ కాబోతుంది. జపాన్ ఫాన్స్ ఎన్టీఆర్ ని సేమ్ డేట్ లో రిలీజ్ చేయమని రిక్వెస్ట్ చేయగా ఎన్టీఆర్ ఒప్పుకున్నాడట. రజినీ సినిమాల తరువాత ఒకే సమయంలో అక్కడ కూడా రిలీజ్ అవ్వబోతున్న రెండో హీరో సినిమా కూడా ఇదే అవ్వడం విశేషం.