Sunday, May 4, 2025
- Advertisement -

దేవర హిట్..తారక్ స్పెషల్ లెటర్

- Advertisement -

ఎన్టీఆర్ హీరోగా కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన చిత్రం దేవర. తారక్ సరసన జాన్వీకపూర్‌ హీరోయిన్‌గా నటించగా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. సెప్టెంబ‌ర్ 27న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రం రూ.590 కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను సాధించింది.

ఈ నేపథ్యంలో ఎక్స్ వేదికగా అభిమానులకు, ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు తారక్. దేవర పార్ట్ 1కి అందుతున్న అద్భుతమైన స్పందనకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ సినిమా ఎప్పటికీ నా హృదయంలో ప్రత్యేక స్థానం కలిగి ఉంటుందన్నారు. నా సహ నటులైన సైఫ్ అలీ ఖాన్, జాన్వీ, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, ఇతర నటీనటులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. వారు తమ పాత్రలకు ప్రాణం పోసి, మా కథకు జీవం ఇచ్చారు. నా దర్శకుడు కొరటాల శివ కి ధన్యవాదాలు చెప్పారు.

మా సినిమాను విజయవంతంగా ప్రదర్శించిన పంపిణీదారులు, థియేటర్ ప్రదర్శకులకు ధన్యవాదాలు. నా సినీ పరిశ్రమ మిత్రులకు, వారు అందించిన ప్రేమకు ధన్యవాదాలు చెప్పారు. దేవర పార్ట్ 1 చిత్రాన్ని మీ భుజాలపై మోసి, ఇంతటి ఘన విజయవంతంగా మార్చినందుకు కృతజ్ఞతలు అని ట్వీట్ చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -