కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి 10 సంవత్సరాలు దాటినప్పటికి వరుస సినిమాలు చేస్తు ఫుల్ బిజీగా ఉంటోంది. తెలుగు, తమిళ భాషలలో అగ్ర హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్‌గా మారింది. ఈ మధ్య కాజల్ హవా కాస్తా తగ్గినప్పటికి సినిమాలలో అవకాశాలు మాత్రం తగ్గలేదు. తాజాగా కాజల్ బెల్లంకొండ శ్రీనివాస్‌తో ఓ సినిమా చేస్తోంది. ఈ సినిమాకు తేజ దర్శకుడు. ఈ సినిమాకు సంబంధించి ఎటువంటి విషయం బయటికి రాలేదు.
కాని కాజల్ సినిమా టైటిల్ గురించి చెప్పి నోరు జారింది. తిరుపతిలో ఓ కార్యక్రమానికి హాజరైన కాజల్ తన కొత్త సినిమాకు సీత అనే టైటిల్ ని పెట్టినట్లు వెల్లడించింది. సినిమా ఎప్పుడు విడుదల అవుతుందో కూడా చెప్పేసింది ఈ భామ. సినిమాను వచ్చే మార్చిలో విడుదల చేయనున్నారట.ఇక ఈ సినిమా కథ మొత్తం కాజల్ చూట్టునే తిరుగుందని తెలుస్తోంది.బెల్లంకొండతో రెండో సినిమా , దర్శకుడి తేజతో మూడో సినిమా చేస్తోంది కాజల్.
- ఏపీ పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం
- కోమటిరెడ్డి..భోళా మనిషి!
- హైదరాబాద్ మెట్రో ఛార్జీల పెంపు
- ఏపీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ పోస్టులకు నోటిఫికేషన్
- రైతులకు గుడ్‌న్యూస్.. ‘ఫార్మర్ ఐడీ’