కాజల్ అగ ర్వాల్ ఇండస్ట్రీకి వచ్చి 10 సంవత్స రాలు దాటిన ఇప్పటికి వరుస సినిమాలు చేస్తుంది. అందం , అభినయం రెండు కాజల్ సొంతం. గత కొంతకాలం కాజల్ హవా తగ్గినప్పిటి ఎదో ఒక సినిమాలో కనిపిస్తు అభిమానులను అలరిస్తుంది. సినిమా ఇండ స్ట్రీకి చెందిన హీరోయిన్లందరు పెళ్లికి రెడీ అవ్వడంతో కాజల్ పెళ్లి ఎప్పడని అందరు అతృతగా ఎదురు చూస్తున్నారు. పైగా కాజల్ చెల్లి నిషా అగర్వాల్ కూడా పెళ్లి చేసుకుని,పిల్లల్ని కూడా కనేసింది. దీంతో కాజల్ పెళ్లి వార్త ఎప్పుడు చెబుతుందని మీడియా ఎదురుచూస్తుంది.
తాజాగా మీడియా కాజల్‌ను ఎప్పుడు పెళ్లి వార్త చెబుతారని ప్రశ్నించగా…ప్రస్తుతం తన దృష్టి మొత్తం సినిమాపైనే ఉందని అన్నారు. పెళ్లి చేసుకోవాల్సి వస్తే సినీ పరిశ్రమకు చెందిన వారిని మాత్రం చేసుకోనని వెల్లడించారు. తనకు ఇండస్ట్రీలో చాలనే మంది ఫ్రెండ్స్ ఉన్నారు, కాని వారిలో ఎవరిని జీవితభాగస్వామిగా ఊహించుకోలేనని తెలిపింది కాజల్. నేను పనిని గౌరంగా భావించి అర్థం చేసుకునే వ్యక్తిని పెళ్లి చేసుకుంటానని చెప్పుకొచ్చింది. ప్రస్తుతానికి కాజల్ వరుస సినిమాలతో బిజీగా ఉంది. క్వీన్ రీమేకతో పాటు, కమల్ హాసన్ భారతీయుడు -2, బెల్లంకొండతో మరో సినిమా చేస్తుంది కాజల్.
- హైదరాబాద్ మెట్రో ఛార్జీల పెంపు
- ఏపీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ పోస్టులకు నోటిఫికేషన్
- రైతులకు గుడ్‌న్యూస్.. ‘ఫార్మర్ ఐడీ’
- ప్రియుడితో డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల!
- అమరావతికి మోదీ..5 లక్షల మందితో సభ