- Advertisement -
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం కల్కి 2898AD.ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్ వచ్చేసింది. ప్రపంచవ్యాప్తంగా జూన్ 27న సినిమాను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
ప్రభాస్ సరసన దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటిస్తుండగా అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటాని కీలకపాత్ర పోషిస్తున్నారు. అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్ పాత్రను ఇటీవలి విడుదల చేసిన చిత్రయూనిట్ తాజాగా రిలీజ్ డేట్‌ని అనౌన్స్ చేసింది.
పాన్-ఇండియా టీజర్ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో రిలీజ్ కాగా కల్కి 2898 AD ఈ సంవత్సరంలో బిగ్గెస్ట్ సినిమాటిక్ ఈవెంట్ గా అలరించనుంది. వైజయంతీ మూవీస్ నిర్మాణంలో జూన్ 27, 2024న రిలీజ్ కానున్నట్లు మేకర్స్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు.