Sunday, May 4, 2025
- Advertisement -

కమల్..భారతీయుడు 2 ట్రైలర్!

- Advertisement -

శంకర్ – కమల్ హాసన్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం భారతీయుడు 2. జూలై 12న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదలకానుంది. ఈ సినిమా తెలుగు థియేట్రికల్ హక్కులను ఏషియ‌న్ సురేష్ ఎంట‌ర్‌టైన్మెంట్స్ ఎల్ఎల్‌పి, సీడెడ్ హ‌క్కుల‌ను శ్రీల‌క్ష్మి మూవీస్ సంస్థ‌లు ద‌క్కించుకున్నాయి.

ఇక ఈ సినిమా నుండి ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ట్రైలర్ డేట్ లాక్ అయింది. ఇవాళ సాయంత్రం 7 గంటలకి తెలుగు సహా తమిళ్ హిందీలో ట్రైలర్ ని రిలీజ్ చేస్తున్నట్టుగా మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. ట్రైలర్‌ రీవిల్‌కు సంబంధించి రిలీజ్ చేసిన పోస్టర్ అందరిని ఆకట్టుకుంటోంది. నెరిసిన గడ్డం, జుట్టు టోపీ పెట్టుకొని ఉన్న కమల్ లుక్ అద్భుతంగా ఉంది. మరి ఈ ట్రైలర్ ఎలా ఉండబోతుంది అని చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

సిద్ధార్థ్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్, ప్రియా భ‌వానీ శంక‌ర్‌, ఎస్‌.జె.సూర్య‌, బాబీ సింహ త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -