విశ్వరూపం పార్ట్ 1 రిలీజ్ అయ్యి దాదాపు నాలుగేళ్లు కాగా.. సెకెండ్ పార్ట్ కోసంఅభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. భారీ బడ్జెట్‌తో హై టెక్నాలజీ వాల్యూస్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీ ఎన్నో అవాంతరాలు, మరెన్నో వివాదాలు, ఇంకెన్నో రాజకీయాల మధ్య అన్ని అడ్డంకుల్ని అధిగమించి సినిమాను అతిత్వరలోనే థియేటర్లలోకి తీసుకొస్తున్నారు కమల్. నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్ నుంచి నిర్మాణ బాధ్యతలను తీసుకున్న కమల్ రిలీజ్‌కు ఏర్పాట్లు చేస్తున్నాడు. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా ఎట్టకేలకు ఈ ఏప్రియల్‌లో విడుదల అవుతుందని అంటున్నారు.
ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులను కమల్ స్టార్ట్ చేశాడని, అన్ని పనులు పూర్తి చేసుకొని ఏప్రియల్‌లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని కమల్ భావిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. ఏప్రియల్‌లో విడుదల కాబోతున్న ఏ సినిమాపై ఈ ఎఫెక్ట్ ఎలా ఉంటుందో చర్చలు ఇప్పుడు టాలీవుడ్‌లో జరుగుతున్నాయి.
ఏప్రియల్ నెలలో రిలీజ్ కావాల్సిన సినిమాల విషయంలో నిర్మాతలు సంప్రదింపులు జరుపుకుని ఓ ఎగ్రిమెంట్ కు వచ్చి రిలీజ్ డేట్ లు ప్రకటించుకున్న విషయం తెలిసిందే. దాని ప్రకారం మహేష్ బాబు ‘భరత్ అనే నేను’ ఏప్రియల్ 20, రజినీకాంత్ ‘కాలా’ ఏప్రియల్ 27, అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య..’ మే 4న విడుదల చేసుకునేలా ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అయితే వీరికి షాక్ ఇచ్చేలా కమల్ హాసన్ ప్లాన్ చేస్తున్నాడని తాజాగా ఫిల్మ్ సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి. కమల్ పొలిటికల్ ఎంట్రీకి ఏ మాత్రం ప్లస్ అవుతుందో చూడాలి