ఇది నిజంగా నిజమే కాని నిజం కాదు.. ఎలా అంటారా న్యూ ఇయర్ నాడు కరీనాకపూర్ పార్టీలు పబ్బులకు అంటూ వెళ్ళకుండా తన అప్ కమింగ్ మూవీ కీ… కా సినిమా షూటింగ్ లో పాల్గొంది. సినిమాలో న్యూ ఇయర్ షూటింగ్ కి సంభందించిన సీన్స్ తీస్తుండటంతో ఆ రోజు నిజంగానే న్యూ ఇయర్ కావడంతో షూటింగ్ లా అనిపించలేదని నిజంగానే జరుగుతున్నట్లే అనిపించిందని చెబుతుంది కరీనా.
షూటింగ్ లో భాగంగా ఇద్దరు ప్రేమికులు తమ ప్రేమని వ్యక్తపరుచుకుని ముద్దుల్లో మునిగిపోవడం ఆ రోజు సీన్. ఆ సీన్ చేసే సమయానికి న్యూ ఇయర్ మొదలవ్వడం మొదటి ముద్దు హీరో అర్జున్ కపూర్ ఇవ్వడం జరిగిందని కరీనాకపూర్ ముసిముసినవ్వులతో చెబుతుంది. ఇలా న్యూ ఇయర్ కి లిప్ లాక్ సీన్ చేయడం కూడా కొత్తగా ఉందని కూడా అంటుంది.
ఇంతకుముందు ఈ సినిమాలో కోస్టార్ అర్జున్ మితిమీరి షూటింగ్ లో రొమాంటిక్ సీన్స్ ఎక్కువగా చేస్తున్నాడని కంప్లైంట్ చేసిన కరీనా తరువాత ఎందుకనో తనతో రొమాంటిక్ సీన్స్ చేయడానికి బయపడలేదు. ఇదంతా ప్రొఫెషన్ లో భాగమే కాబట్టి ప్రతీ సందర్బాన్ని ఆస్వాదించాలని అంటూ తన న్యూ ఇయర్ కహానీ చెప్పింది.