మహేశ్ బాబు..టాలీవుడ్ సూపర్ స్టార్, ఆరడుగుల అందగాడు,అమ్మాయిల కలల రాకుమారుడు ఇంకా చెప్పాలంటే చాలానే ఉన్నాయి.కాని అభిమానులకు మాత్రం ప్రిన్స్. మహేశ్ బాబు ఒక్క తెలుగులోనే సినిమాలు చేస్తున్నప్పటికి ఇండియా మొత్తం క్రేజ్ తెచ్చుకున్నాడు మహేశ్ బాబు.బాహుబలి విడుదలకు ముందు బాలీవుడ్‌లో తెలుగులో హీరోలలో అక్కడ జనాలకు మన హీరోలు ఎవరైన తెలుసంటే మాత్రం అది మహేశ్ బాబు మాత్రమే.పలువురు బాలీవుడ్ హీరోయిన్లు సైతం తెలుగులో సినిమా చేస్తే మహేశ్‌తోనే చేస్తామని చెప్పేవారు.
అక్కడ వారికి చాలామందికి మహేశ్ అంటే ఇష్టం కూడా. తాజాగా మహేశ్ బాబు కోసం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ తెలుగు ఇండస్ట్రీకి వస్తుందని తెలుస్తోంది.బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్ మహేశ్ బాబుతో ఓ సినిమా చేయనుందని సమాచారం. మహేశ్ బాబు సుకుమార్ కాంబినేషన్‌లో ఓ మూవీ తెరకెక్కనుంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా కత్రినాను ఫిక్స్ చేశాడట సుకుమార్.
ఇటీవలే సుకుమార్ కత్రినాను కలిసి కథను వినిపించడం,కత్రినా ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ చకా చకా జరిగిపోయినట్లు సమాచారం అందుతోంది. కత్రినా గతంలో కొన్ని తెలుగు సినిమాలలో నటించింది. వెంకటేశ్‌తో మల్లేశ్వరి, బాలయ్యతో అల్లరి పిడుగు వంటి సినిమాలలో నటించింది.మహేష్‌తో నటించే అవకాశం వస్తే తప్పకుండా నటిస్తాను అని గతంలోనే కత్రినా ఒక ఇంటర్వ్యూలో చెప్పింది.
- ఏపీ పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం
- కోమటిరెడ్డి..భోళా మనిషి!
- హైదరాబాద్ మెట్రో ఛార్జీల పెంపు
- ఏపీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ పోస్టులకు నోటిఫికేషన్
- రైతులకు గుడ్‌న్యూస్.. ‘ఫార్మర్ ఐడీ’