ఇప్పుడు ఎక్కడ చూసిన బిగ్‌బాస్ కంటెస్టెంట్ కౌశల్ గురించే చర్చ నడుస్తుంది.బిగ్‌బాస్ రెండో సీజన్ మొత్తం కౌశల్ చూట్టునే తిరుగుతుంది.అతని పేరు మీద సోషల్ మీడియాలో కౌశల్ ఆర్మీ అనే గ్రూపును క్రియేట్ చేసుకుని కౌశల్‌కు మద్దతుగా నిలుస్తున్న సంగతి తెలిసిందే.హౌస్‌లో కౌశల్‌ని ఎవరు అయిన టార్గెట్ చేస్తే, వెంటనే ఈ కౌశల్ ఆర్మీ రెచ్చిపోయి సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు.చివరికి బిగ్‌బాస్ హౌస్ట్‌గా వ్యవహారిస్తున్న నానిని కూడా ఈ కౌశల్ ఆర్మీ వదలడం లేదు.పొరపాటున నాని.. కౌశల్‌ని ఏం ప్రశ్నించినా అది కౌశల్ ఆర్మీకి తప్పుగానే కనిపిస్తుంది. దీంతో నాని నటించిన ‘దేవదాస్’ సినిమా ఫ్లాప్ చేస్తామని నానిని హెచ్చరించడం మొదలుపెట్టారు. ఇదంతా పక్కన పెడితే నిన్న థియేటర్ లోకి వచ్చిన ‘దేవదాస్’ హిట్ టాక్ తో దూసుకుపోతుంది.
తాజాగా ఈ ఇష్యూపై హీరో మంచు మనోజ్ స్పందించాడు.”దేవ అండ్ దాస్ కాంబో అంటేనే చాలా థ్రిల్లింగ్‌గా అనిపిస్తోంది. ఇద్దరు చాలా అందమైన నటులను సింగిల్ స్క్రీన్‌పై చూడటం అనేది ఒక ట్రీట్. రోజురోజుకీ యంగ్ అవుతున్న నాగార్జున గారికి బెస్ట్ విషెస్” అంటూ తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేశాడు మనోజ్.దీనిపై స్పందించిన కౌశల్ ఆర్మీ సభ్యుడు.. ”ఏం థ్రిల్లింగ్ భయ్యా.. మా కౌశల్ ఆర్మీ ఫ్యాన్స్ ని హర్ట్ చేశాడు” అని రిప్లై చేశాడు. దీనికి సమాధానంగా మంచు మనోజ్ ”సినిమా అనేది ఒక్కరిది కాదు.. ఎంతో మంది ఆకలి కష్టం.. ఎన్నో డిపార్ట్మెంట్లు రేయింబవళ్లు కుటుంబానికి దూరంగా ఉంటూ పని చేస్తారు.మనోజ్ చేసిన ట్వీట్‌పై కొందరు పాజిటివ్‌గా స్పందిస్తున్నారు.మరి కొందరు కౌశల్‌ను అంటే మాత్రం ఊరుకోము అని హెచ్చరిస్తున్నారు.దీంతో ఈ గొడవ కాస్తా మనోజ్ వర్సెస్ కౌశల్ ఆర్మీగా మారింది.