అల్లు అర్జున్‌కు నా పేరు సూర్య సినిమా ఇచ్చిన షాక్ నుంచి కోలుకోవడానికి చాల సమయమే పట్టింది. ఈ సినిమా తరువాత చాల గ్యాప్ తీసుకున్న బన్ని మధ్యలో కొన్ని కథలు విన్నప్పటికి అవి నచ్చకపోవడంతో ఈ గ్యాప్ ఇంకాస్తా పెరిగింది. తాజాగా త్రివిక్రమ్‌తో సినిమా ఓకే చేశాడు బన్ని. త్రివిక్రమ్‌తో అంతకముందు రెండు సినిమాలు చేశాడు బన్ని.తాజాగా ఈ సినిమా నుంచి మరో న్యూస్ బయటికి వచ్చింది.ఈ సినిమా హీరోయిన్‌గా కియారా అద్వానీని తీసుకుంటున్నట్లు సమాచారం.
భరత్ అనే నేను సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచియం అయింది కియారా. రామ్ చరణ్‌తో నటించిన వినయ విధేయ రామ సినిమా విడుదలకు రెడీ అవుతుంది. ఈ సినిమాలో కియారా అయితేనే బాగుంటుందని భావిస్తున్న బన్ని , ఆమెనే కావలనే పట్టుపబుతున్నాడట. దీంతో ఆమె డేట్స్ వెతికే పనిలో పడ్డాడు చిత్ర నిర్మాత అల్లు అరవింద్. మొత్తనికి మూడో సినిమా కూడా స్టార్ హీరోతో చేయనుంది కియారా.
- ఏపీ పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం
- కోమటిరెడ్డి..భోళా మనిషి!
- హైదరాబాద్ మెట్రో ఛార్జీల పెంపు
- ఏపీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ పోస్టులకు నోటిఫికేషన్
- రైతులకు గుడ్‌న్యూస్.. ‘ఫార్మర్ ఐడీ’