ఓ భూ వివాదానికి సంబంధించి హైకోర్టును ఆశ్రయించారు జూనియర్ ఎన్టీఆర్. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 75లో ఓ ఫ్లాట్ విషయంలో ఎన్నారై మహిళ తనను మోసం చేసిందని హైకోర్టును ఆశ్రయించారు. 2003లో గీత లక్ష్మీ అనే మహిళ నుండి ప్లాట్ కొనుగోలు చేశారు ఎన్టీఆర్. అయితే అప్పటికే లక్ష్మీ 1996 నుండి వివిధ బ్యాంకుల వద్ద ప్రాపర్టీ మోర్ట్ గేజ్ తీసుకోగా కేవలం ఒకే బ్యాంకు వద్ద మోర్ట్ గేజ్ ఉన్నట్లు చెప్పగా దానిని విడిపించి డాక్యుమెంట్లు తీసుకున్నారు.
అయితే ఆ తర్వాతే తాను మోసపోయానని గ్రహించిన ఎన్టీఆర్ కు … పలు బ్యాంకు మేనేజర్లతో వివాదం కొనసాగుతుంది. ప్రాపర్టీను స్వాధీనం చేసుకునేందుకు బ్యాంక్ మేనేజర్లు ప్రయత్నించడంతో బ్యాంకు మేనేజర్లపై గతంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు ఎన్టీఆర్. దీనిపై 2019లో పోలీసులు ఛార్జీ షీట్ నమోదుచేయగా తాజాగా DRTలో తీర్పు ఎన్టీఆర్‌కు వ్యతిరేకంగా వచ్చింది.
దీనిని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఎన్టీఆర్. జూన్ 3 లోపు DRT డాకెట్ ఆర్డర్ సబ్మిట్ చేయమని హైకోర్టు ఆదేశించగా తదుపరి విచారణ జూన్ 6న విచారణ చేపడతామని తెలంగాణ హైకోర్టు తెలిపింది.
ప్రస్తుతం టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్నారు ఎన్టీఆర్. బాలీవుడ్‌లో హృతిక్‌తో కలిసి వార్ 2 చేస్తుండగా టాలీవుడ్‌లో కొరటాల శివతో కలిసి దేవర చేస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకురానుంది.