టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు కొత్త సంవత్సరం నాడు అభిమానులు గిఫ్ట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. మహేశ్ బాబు ప్రస్తుతం మహర్షి సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా మహేశ్ కెరీర్‌లో 25వ సినిమా కావడంతో చాలా ప్రతీష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆప్డెట్ బయటికి వచ్చింది. కొత్త సంవత్సరం నాడు సినిమాలోని ఓ పోస్టర్‌ను విడుదల చేయనున్నారని తెలుస్తుంది.
జనవరి 1న సినిమాలోని మహేశ్ బాబు స్టిల్ ఒకటి రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. వంశీ పైడిపల్లి దరకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మహేశ్ మూడు డిఫరెంట్ క్యారెక్టర్లో కనిపించనున్నాడు. ఇక ఈ సినిమాలో అల్లరి నరేష్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. పూజా హెగ్డె హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను వచ్చే వేసవిలో విడుదల చేయనున్నారు.
- ఏపీ పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం
- కోమటిరెడ్డి..భోళా మనిషి!
- హైదరాబాద్ మెట్రో ఛార్జీల పెంపు
- ఏపీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ పోస్టులకు నోటిఫికేషన్
- రైతులకు గుడ్‌న్యూస్.. ‘ఫార్మర్ ఐడీ’
- ప్రియుడితో డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల!