సూపర్ స్టాప్ మహేష్ బాబు, సమంత, కాజల్, ప్రణతీ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం బ్రహ్మోత్సవం. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్నికి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. అయితే ఈ సినిమా కథ మొత్తం విజయవాడ బ్యాక్ డ్రాప్ లో నడుస్తుందని అంటున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రోడక్షన్ పనులు జరుపుకుంటుంది.
అయితే తాజాగా ఈ చిత్రానికి సంబందించి మహేష్ తన డబ్బింగ్ పార్ట్ ని పూర్తి చేశాడట. ప్రస్తుతం ఇంకా మిగిలిన కొంత మంది నటి నటులతో డబ్బింగ్ కార్యక్రమాల్ని జరుపుతున్నారు మేకర్స్. ఇప్పటికే విడుదల అయిన పోస్టర్స్ నుండి ట్రైలర్స్ దాక బ్రహ్మోత్సవం సినిమాపై అంచనాలు పెంచుతూ వచ్చేశాయి.
ఇప్పుడు టాలీవుడ్ లో బ్రహ్మోత్సవం క్రేజ్ ఓ రేంజ్ లో ఉంది. ఈ బుధవారానికల్ల ఫస్ట్ కాపీని రెడీ చేసి సెన్సార్ చేయించడానికి అన్ని పనులు చాలా వేగంగా చేస్తున్నరాట. మరో దిక్కు నిర్మాత పి వి పి, మహేష్ లు కలిసి ప్రమోషన్ ఈవెంట్స్ ని భారీగానే ప్లాన్ చేస్తున్నారు. మహేష్ సరసన ఈ చిత్రంలో సమంత కాజల్ ప్రణీత లు హీరోయిన్ లుగా నటిస్తున్నారు. మిక్కి జే మేయర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని మే 20న భారీ ఎత్తున విడుదల చేస్తున్న విషయం తెలిసిందే.