టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబుకు సినిమాలు;ఫ‌్యామిలీ తప్ప మరో ధ్యాస ఉండదని అందరికి తెలిసిన విషయమే. సినిమా షూటింగ్‌లో గ్యాప్ దోరికితే చాలు ఫ్యామిలీని తీసుకుని విదేశాలకు చెక్కేస్తుంటాడు మహేశ్ బాబు. అలాంటి మహేశ్ బాబును రాజకీయాలు ఎప్పుడు వెంటాడుతునే ఉంటున్నాయి. మహేశ్ పొలిటికల్ ఎంట్రీపై ఎప్పటి నుంచే రకరకాల వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలను మహేశ్ కూడా ఎప్పటికప్పుడు ఖండిస్తునే ఉన్నాడు.
మహేశ్ మీడియా సమావేశం పెడితే చాలు రాజకీయలపై స్పందించమని జర్నలిస్ట్‌లు సైతం అడుగుతుంటారు. ఇక మహేశ్ కూడా ఎప్పుడు చెప్పిందే చెబుతుంటాడు..రాజకీయలపై నాకు ఆసక్తి లేదు, వాటి మీద కనీస నాకు అవగాహన కూడా లేదని మహేశ్ చాలాసార్లు పలు వేదికల మీద చెప్పడం జరిగింది. రాజకీయాలతో సంబంధం లేకుండా తెలంగాణ, ఏపీలలో ఓ గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ది కార్యక్రమాలను చెపట్టిన సంగతి తెలిసిందే. ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతుండంటంతో సీట్ల కోసం పార్టీలు మారే నాయకులు కూడా ఎక్కువైయ్యారు. తాజాగా వైసీపీ పార్టీని వీడి టీడీపీలో చేరారు సూపర్‌స్టార్ కృష్ణ తమ్ముడు,మహేశ్ బాబాయ్ ఘట్టమనేని ఆదిశేషగిరిరావు.
ఆయనకు కండువా కప్పి మరి టీడీపీలోకి ఆహ్వానించారు ఏపీ సీఎం చంద్రబాబు. ఇక్కడ వరకు బాగానే ఉంది కాని .. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతు మహేశ్ బాబు కూడా టీడీపీకి మద్దతిస్తారని ,ఆదిశేషగిరిరావు గారు చెప్పారని మీడియా ఎదుట చెప్పారు. దీంతో మళ్లీ మహేశ్ పొలిటికల్ ఎంట్రీపై చర్చ మొదలైంది. మహేశ్ బాబాయ్ ఆదిశేషగిరిరావు చెప్పారో లేదో తెలియదు కాని చంద్రబాబు మాత్రం మీడియాతో చెప్పేశారు. ఆదిశేషగిరిరావు వైసీపీలో ఉన్నప్పుడు మహేశ్ ఆ పార్టీకి మద్దతు తెలపలేదు కదా..మరి ఇప్పుడు టీడీపీకి ఎలా మద్దతు తెలుపుతారని ప్రశ్నిస్తున్నారు ఆయన అభిమానులు.
మహేశ్ రాజకీయాలలోకి వచ్చే ప్రసక్తే లేదని వారు అంటున్నారు. అభిమానులు వారికి నచ్చిన పార్టీకి ఓటు వేసుకోవచ్చని ,ఇలాంటి పుకార్లను నమ్మవద్దని మహేశ్ అభిమాన సంఘాలు కోరుతున్నాయి. గతంలో మహేశ్ బాబు బావ గల్ల జయదేవ్ టీడీపీ ఎంపీగా పోటీ చేసినప్పుడు కూడా మహేశ్ టీడీపీకి ఓటు వేయండి అని ఎక్కడ ఎవ్వరిని కోరలేదు. మరి ఇప్పుడు మహేశ్ టీడీపీ ఎలా ఓటు వేయమంటారని అభిమానులు ఆదిశేషగిరిరావును ప్రశ్నిస్తున్నారు. అయిన ఏపీలో ఓటు హక్కు లేని మహేశ్ ఏ పార్టీకి మద్దతిస్తే ఏమవుతుందని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. మరి మహేశ్ ఎప్పటి లాగే రాజకీయాలకు దూరంగా ఉంటాడో లేక,పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి అందరికి షాకిస్తాడో చూడాలి.
- హైదరాబాద్ మెట్రో ఛార్జీల పెంపు
- ఏపీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ పోస్టులకు నోటిఫికేషన్
- రైతులకు గుడ్‌న్యూస్.. ‘ఫార్మర్ ఐడీ’
- ప్రియుడితో డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల!
- అమరావతికి మోదీ..5 లక్షల మందితో సభ