టాలీవుడ్‌ను గత కొంతకాలంగా పైరసీ భూతం పట్టి పిడిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో సినిమాలు విడుదలైన రెండు రోజులు తరువాత కాని ఆ సినిమాను పైరసీ చేసి నెట్లో పెట్టేవారు.ఇప్పుడు సినిమా విడుదల రోజునే పైరసీ చేసి ఆన్‌లైన్‌లో పెడుతున్నారు. ప్రస్తుతం ట్రెండ్ మారిందనే చెప్పాలి. సినిమా షూటింగ్ దశలో ఉండగానే కొన్ని సీన్లు ఆన్‌లైన్‌లో ప్రత్యక్షం అవుతున్నాయి.
విజయ్ దేవరకొండ నటించిన గీతా గోవిందం, టాక్సీవాలా సినిమాలు విడుదల కాకుండానే నెట్‌లో హాల్ చల్ చేశాయి. తాజాగా టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు నటిస్తున్న మహర్షి సినిమాలోని కొన్ని సీన్లు ఆన్‌లోన్ ప్రత్యక్షం కావడం ఆశ్చర్యం కలిగిస్తుంది. సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో ఎవరో అక్కడ ఉన్నవారు తమ సెల్‌ఫోన్లలో వీడియోలు తీసి వాటిని సోషల్ మీడియాలో పెట్టేశారు.లీక్ అయిన సీన్లలో మహేష్ బాబు, అల్లరి నరేష్ కి సంబంధించిన సన్నివేశాలు ఉన్నాయి. అలానే సినిమాలో ఒక పాటకి సంబంధించిన విజువల్స్ కూడా ఆన్ లైన్‌లో లీక్ అయినట్లు తెలుస్తుంది.
ఈ విషయం తెలుసుకున్న చిత్ర యూనిట్ ఈ సీన్లను ఆన్‌లైన్ నుంచి తొలగించే విధంగా చర్యలు తీసుకుంది. ఇక ఈ సినిమా షూటింగ్ దాదాపు 70% పూర్తైనట్లు తెలుస్తుంది. సినిమా చివరి షెడ్యూల్ కోసం చిత్ర యూనిట్ అమెరికాకు వెళ్లింది. మహర్షి మహేశ్ కెరీర్‌లో 25వ సినిమా కావడంతో చాలా ప్రతీష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా పూజా హెగ్డె నటిస్తుంది. సినిమాను వచ్చే ఏప్రిల్ 5న విడుదల చేయనున్నారు.
- హైదరాబాద్ మెట్రో ఛార్జీల పెంపు
- ఏపీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ పోస్టులకు నోటిఫికేషన్
- రైతులకు గుడ్‌న్యూస్.. ‘ఫార్మర్ ఐడీ’
- ప్రియుడితో డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల!
- అమరావతికి మోదీ..5 లక్షల మందితో సభ