మహేశ్ బాబు ఏంటీ సానియా మీర్జా ఏంటీ అనుకుంటున్నారా..? ఏం లేదండీ మహేశ్ బాబు న్యూ ఇయర్ వేడుకల కోసం ఫ్యామిలీతో కలిసి దుబాయ్ వెళ్లాడు. కొత్త సంవత్సరం నాడు అక్కడే ఎంజాయ్ చేశాడు మహేశ్ బాబు. తాను నటిస్తున్న మహర్షి సినిమా షూటింగ్‌కు కాస్తా గ్యాప్ ఇచ్చి మరి వెకేషన్‌కు వెళ్లాడు మహేశ్. న్యూ ఇయర్ వేడుకలు పూర్తి అయినప్పటికి అక్కడే ఉండి ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నాడు మహేశ్.
అయితే అక్కడే ఉన్న ఇండియన్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జాను కలిశాడు మహేశ్.సానియా- షోయబ్ మాలిక్ జంట కూడా కొత్త సంవత్సరం నాడు వేడుకలను దుబాయ్‌లోనే జరుపుకున్నారు.దుబాయ్ లోనే వీళ్లంతా కొత్త సంవత్సర వేడుకల్లో పాల్గొన్నారు. మహేశ్ భార్య నమ్రతకు,సానియా మీర్జాకు మధ్య మంచి స్నేహబంధం ఉంది. వీరందరు కలిసి ఉన్న ఫోటోను తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేసింది నమ్రత. ఇలా సానియా మీర్జాతో మహేశ్ కలిసి ఫోటో దిగడంపై అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

- హైదరాబాద్ మెట్రో ఛార్జీల పెంపు
- ఏపీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ పోస్టులకు నోటిఫికేషన్
- రైతులకు గుడ్‌న్యూస్.. ‘ఫార్మర్ ఐడీ’
- ప్రియుడితో డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల!
- అమరావతికి మోదీ..5 లక్షల మందితో సభ