టాలీవుడ్‌లో హీరోల ఫ్యాన్స్ గొడవ ఎప్పటి నుంచో ఉంది.అయితే గత కొంతకాలంగా ఫ్యాన్స్ మధ్య గొడవలు కాస్తా సర్దుమణిగినట్లే కనిపించాయి.అయితే టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు చేసిన ఓ ట్విట్ మళ్లీ ఫ్యాన్స్ మధ్య గొడవలకు దారి తీసింది. తాజాగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ మహేష్ పై విరుచుకుపడుతున్నారు. ఇటీవల విడుదలైన ‘సర్కార్’ సినిమా బాగుందని, మురుగదాస్ ట్రేడ్ మార్క్ ఫిలిం అంటూ మహేష్ బాబు ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. మురుగదాస్ తో తనకున్న బాండింగ్ తో మహేష్ బాబు ఈ ట్వీట్ చేశాడు.వీరిద్దరి కాంబినేషన్‌లో స్పైడర్ సినిమా కూడా వచ్చింది.
అయితే మహేశ్ చేసిన ఈ ట్విట్‌పై ఎన్టీఆర్ అభిమానులు ఫైర్ అవుతున్నారు.ఎన్టీఆర్ నటించిన ‘అరవింద సమేత’ లాంటి హిట్ సినిమాకి స్పందించని మహేష్ కి ‘సర్కార్’ సినిమాపై ట్వీట్ చేయడానికి మాత్రం టైమ్ ఉందా అంటూ అర్ధంలేని విధంగా వాదిస్తున్నారు. మహేష్ ట్వీట్ చేయడం, చేయకపోవడం ఆయన వ్యక్తిగత విషయమని దానికి ఆయన్ని టార్గెట్ చేయడం కరెక్ట్ కాదని మహేష్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.మొత్తనికి మహేశ్ బాబు చేసిన ఒక్క ట్విట్ ఫ్యాన్స్ మధ్య పెద్ద రచ్చే సృష్టిచింది