సుధీర్ బాబు హీరోగా జ్ఞాన సాగర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం హరోంహర. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుమంత్ జి నాయుడు నిర్మిస్తుండగా సుధీర్ సరసన మాళవిక శర్మ హీరోయిన్ గా నటిస్తోంది.
సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ట్రైలర్‌ని రిలీజ్ చేశారు సూపర్‌స్టార్ మహేష్ బాబు. ఈ సందర్భంగా చిత్ర బృందానికి బెస్ట్ ఆఫ్ లక్ చెప్పారు. హరోం హర జూన్ 14న రిలీజ్ కానుండగా తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో పాన్ ఇండియా వైడ్ ఈ సినిమా రిలీజ్ కానుంది.
1980s బ్యాక్‌డ్రాప్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా రూరల్ గ్యాంగ్ స్టార్ కథాంశంతో రానున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్, ఓ సాంగ్ రిలీజ్ చేసి అంచనాలు పెంచారు. మరి ఈ సినిమాతోనైనా సుధీర్ బాబు హిట్ కొడతారా వేచిచూడాలి.
Looking forward to see what #HaromHara brings to the screen! The trailer looks interesting! My best wishes to @isudheerbabu and team!! 👍👍https://t.co/EUEgm04BIU@ImMalvikaSharma @gnanasagardwara #SumanthNaiduG @chaitanmusic @JungleeMusicSTH @SSCoffl
— Mahesh Babu (@urstrulyMahesh) May 30, 2024