Monday, May 5, 2025
- Advertisement -

మ‌హేశ్‌,ఎన్టీఆర్ ఫాన్స్ మ‌ధ్య గొడ‌వ పెట్టిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌

- Advertisement -

టాలీవుడ్‌లో ఫ్యాన్స్ మ‌ధ్య గొడ‌వ‌లు ఇప్ప‌టివి కావు.గ‌తంలో ఎన్టీఆర్‌-కృష్ణ అభిమానుల మధ్య నిత్యం గొడ‌వ‌లు జ‌రిగేవి.ట్రెండ్ మారింది.ఇప్పుడు హీరోల ఫ్యాన్స్ సోష‌ల్ మీడియాను వేధిక‌గా గొడ‌వ‌లు ప‌డుతున్నారు.మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అని తమ హీరోల‌పై అభిమానాన్ని చాటుకుంటున్నారు.అయితేప్ర‌స్తుత టాలీవుడ్ హీరోల‌లను క‌లిపిన ఘ‌న‌త మ‌హేశ్ బాబుకే ద‌క్కుతుంది.భ‌ర‌త్ అను నేను సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఎన్టీఆర్‌ను పిలిచి మా మ‌ధ్య ఎటువంటి గొడ‌వ‌లు మేం బాగానే ఉంటాం మీరే బాగుప‌డాలి అంటూ ఫాన్స్‌కు క్లాస్ పీకాడు మ‌హేశ్ బాబు.అదేవిధాంగా రామ్‌చ‌ర‌ణ్‌కూడా త‌న‌కు మంచి స్నేహితుడే అని సోష‌ల్ మీడియా సాక్షిగా కొన్ని ఫోటోల‌ను విడుద‌ల చేశాడు మ‌హేశ్‌. వీరు ముగ్గురూ కలిసి పార్టీలో ఫోటోలు దిగడం వాటిని అభిమానులను పంచడం వంటివి చేస్తూ తమ మధ్య ఎలాంటి విబేధాలు లేవని, అభిమానుల మధ్య కూడా సఖ్యత మెలగాలంటూ సందేశాలు ఇస్తున్నారు.

దీంతో ఫాన్స్ మ‌ధ్య వార్ కాస్తా త‌గ్గింద‌నే చెప్పాలి.కాని అనుకోకుండా మ‌హేశ్‌,ఎన్టీఆర్ ఫాన్స్ మ‌ధ్య గొడ‌వ‌లు పెట్టాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌.గీతా గోవిందం స‌క్సెస్‌తో మంచి జోష్‌లో ఉన్న విజ‌య్ దేవ‌ర‌కొండ ‘మహర్షి’ సినిమా సెట్స్‌కి వెళ్లి అక్కడ మహేశ్‌తో ఫోటో దిగి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అభిమానులతో పంచుకున్నాడు.దీనికి మహేశ్‌ వెంటనే రిప్లై ఇస్తూ విజయ్‌ని పొగుడుతూ పోస్ట్ పెట్టాడు. అంతే.. ఇంక ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. మహేష్ పుట్టినరోజు నాడు తారక్ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పినా. దానికి స్పందించని మహేష్, విజయ్ ట్యాగ్ కూడా చేయకపోయినా వెంటనే స్పందించారంటూ మహేష్ పై నెగెటివ్ కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు.మ‌రి మ‌హేశ్‌,ఎన్టీఆర్ ఫాన్స్ మ‌ధ్య ఈ వివాదం ఎంత దూరం వెళ్తుందో చూడాలి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -