మంచు వారి కుటుంబంలో మరో వ్యక్తి చేరబోతున్నారు. అవును హీరో మంచు విష్ణు మరోసారి తండ్రి కాబోతున్నాడు. విష్ణు భార్య వినీ ప్రస్తుతం గర్భవతి అని తెలుస్తోంది. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలిపాడు విష్ణు. , ‘ఓ స్పెషల్ లొకేషన్ నుంచి స్పెషల్ అనౌన్స్ మెంట్. వినీ స్వగ్రామం, నా ఫేవరెట్ ప్లేస్ ఇది. తమ కుటుంబంలో మరో లిటిల్ ఏంజల్ వచ్చి చేరనుందని చెప్పేందుకు సంతోషిస్తున్నా’ అని తెలిపాడు మంచు విష్ణు. 2008లో మంచు విష్ణు వినీను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.
విష్ణు దంపతులకు మొదట కవల పిల్లలు పుట్టారు. వీరిద్దరు ఆడపిల్లలే. వీరికి అరియానా, వివియానా అని పేర్లు పెట్టారు. ఆ తరువాత కొంత కాలానికి అవ్రామ్ అనే బాబుకు జన్మనిచ్చారు ఈ దంపతులు. తాజాగా తాను మరోసారి తండ్రిని కాబోతున్నానని విష్ణు ప్రకటిచడంతో ఆయనకు సోషల్ మీడియాలో పలువురు అభినందనలు తెలుపుతున్నారు. మొత్తనికి విష్ణు నాలుగోసారి తండ్రి కాబోతున్నాడని సోషల్ మీడియాలో అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. విష్ణు చేతిలో ప్రస్తుతం ఒక్క సినిమా కూడా లేదని తెలుస్తోంది.
- Advertisement -
నాలుగోసారి తండ్రి కాబోతున్న మంచు విష్ణు
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -