హీరో మంచు మనోజ్ మరోసారి తన మంచి మనస్సును చాటుకున్నాడు. సామాజికసేవా కార్యక్రమాల్లో ముందు ఉండే మంచు మనోజ్ తాజాగా ఓ బాలికను దత్తత తీసుకున్నాడు. సిరిసిల్ల ప్రాంతానికి చెందిన అశ్విత అనే బాలికను దత్తత తీసుకున్నాడు. తన తండ్రి మోహన్ బాబు 69వ పుట్టినరోజును పురస్కరించుకుని ఓ మంచి పని చేయలనే ఉద్దేశంతో ఈ పాపను దత్తత తీసుకన్నాడట మంచు మనోజ్. తిరుపతిలోని తమ సొంత కాలేజీలో చేరించారు మంచు మనోజ్.
ఆ పాప బాధ్యతలు అన్ని తానే చూసుకుంటానని తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. పాపకు ఐఏఎస్ అధికారి కావాలనే కోరికని , ఆమె ఏం చదువుకున్న ,తనకు కావాల్సినదంతా చేస్తానని తెలిపాడు. ఆమెకు మంచి జీవితాన్ని ఇచ్చేంత వరకు తోడుగా ఉంటానని చెప్పుకొచ్చారు. మంచు మనోజ్ చేసిన ఈ పనికి నెటిజన్లు ప్రసంశల వర్షం కురిపిస్తున్నారు. నువ్వు రియల్ హీరో అన్న అని ఒకరు కామెంట్ చేయగా, తెలుగు హీరోలందరు నిన్ను ఆదర్శంగా తీసుకుని సేవలు చేయలని మరి కొందరు కామెంట్ చేశారు.
- Advertisement -
పాపను దత్తత తీసుకున్న మంచు మనోజ్
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -