- Advertisement -
మంచు మోహన్ బాబు కుమారుడు మంచు మనోజ్ ఓ వివాదంలో చిక్కుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.పూర్తి వివరాలలోకి వెళ్తే…మే 22న హీరో మనోజ్‌తోపాటు ఆయన స్నేహితులు ఫ్యాట్ పిజియన్ పబ్‌కు వెళ్లారు.పార్టీలో బాగా తాగేసిన మనోజ్ పబ్ నిర్వాహకులతో గొడవ పడినట్లు తెలుస్తోంది.కోపంలో మనోజ్ అక్కడ ఉన్న డిజే సిస్టమ్‌ను, పబ్ అద్దాలను పగలగొట్టడని సమాచారం.
దీంతో అతని స్నేహితులు అక్కడి నుండి మనోజ్‌ను తీసుకువెళ్లరని తెలుస్తుంది.అర్ధరాత్రి పబ్ లో చోటు చేసుకున్న ఈ సంఘటన ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. మంచు మనోజ్‌పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు రిజిస్టర్ చేశారు.అసలే సరైన హిట్లు లేక ఇబ్బంది పడుతున్న మనోజ్‌కు ఈ వ్యవహరం పెద్ద తల నోప్పిగా మారింది.మరి ఈ గొడవ ఎంత దూరం వెళ్తుందో చూడాలి.