Saturday, May 3, 2025
- Advertisement -

మంచు ఫ్యామిలీలో మళ్లీ హైడ్రామా?

- Advertisement -

మంచు ఫ్యామిలీలో నెలకొన్న వివాదం ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. తాజాగా అర్థరాత్రి నటుడు మంచు మనోజ్ హైడ్రామా చేశారు. బాకారాపేట సమీపంలోని ఓ రిసార్ట్స్‌లో బస చేశారు మంచు మనోజ్. పెట్రోలింగ్‌లో ఉన్న ఎస్ఐ.. మనోజ్ బౌన్సర్లను విచారించడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు మనోజ్.

అంతేగాదు రాత్రి 11 గంటల నుంచి 1 గంట వరకు బాకారాపేట పీఎస్ మెట్ల వద్ద కూర్చోని ఆందోళన చేపట్టారు. ఆ తర్వాత సీఐ వచ్చి సర్దిచెప్పడంతో ఆందోళన విరమించారు.

దీనిపై మాట్లాడిన మనోజ్.. తాను భ‌య‌ప‌డ‌తాను అనుకుంటున్నారేమో.. అది ఈ జ‌న్మ‌లో జ‌ర‌గ‌దు అని తేల్చిచెప్పారు. గ‌త కొన్ని నెల‌లుగా ఏం జ‌రుగుతుందో మీ అంద‌రికి తెలుసు,,. ఈ విష‌యంలో మిమ్మ‌ల్ని ఇబ్బందిపెట్టి ఉంటే మ‌మ్మ‌ల్ని క్షమించండి అన్నారు.

ఎందుకంటే ఈ స‌మ‌స్య నా ఒక్క‌రిదే కాదు. నా స్టూడెంట్స్ కావచ్చు.. లేదా మా కాలేజ్ ఎదురుగా ఉన్న ప్ర‌జ‌ల కోసం కావచ్చు వారి కోసమే ఈ పోరాటం అని తేల్చిచెప్పారు. నేను అంద‌రి కోసం పోరాడుతుంటే నా మీదా అటాక్‌లు చేస్తూ.. త‌ప్పుడు కేసులు పెడుతూ.. నా కుటుంబ స‌భ్యుల‌ను ఇందులోకి లాగుతూ.. ఒక మ‌నిషిని ఎన్ని విధాలుగా నాశ‌నం చేయాలో అన్ని చేస్తున్నారు. ఇవన్ని చూసి నేను భ‌య‌ప‌డతాను అనుకుంటున్నారేమో.. అది ఈ జ‌న్మ‌లో జ‌ర‌గ‌దు అని స్పష్టం చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -