- Advertisement -
టాలీవుడ్ సీనియర్ హీరో కలెక్షన్ కింగ్ మోన్ బాబు ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతు సరాదాగా ఆయన ఫసక్ అనే పదాన్ని వాడారు.అంతే ఈ పదం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది.పలు టీవి షోలలో కూడా ఆ పదాన్ని సరాదాగా వాడేస్తున్నారు.ఆ మధ్య మంచు మనోజ్ కూడా మా అసోసియేషన్‌లో గొడవలు జరుగుతున్న సందర్భంలో నేను కనుక వచ్చానంటే అందరికి ఫసకే అని వాఖ్యానించారు. తాజాగా ఆయన మరోసారి ఫసక్‌పై ఫన్నీ ట్వీట్ చేశారు.
ఒక వ్యక్తి ఫోర్క్ స్పూన్ తో నూడిల్స్ ని తీసుకొని వాటిని కట్ చేసి తింటున్న వీడియోని షేర్ చేసిన మంచు మనోజ్.. ”ఇప్పుడు నూడిల్స్ సమస్య సాల్వ్ అయింది. ‘ఫసక్’ బై ఇండియన్” అంటూ ట్వీట్ చేశాడు.మంచు మనోజ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటాడు.మనోజ్ చేసిన ట్వీట్‌పై నెటిజన్లు సరాదాగా కామెంట్స్ చేస్తున్నారు.