మెగా బ్రదర్ నాగబాబు గత కొంతకాలంగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోన్న సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితం వరకు బాలయ్యపై కామెంట్స్ చేశారు నాగబాబు. ఇటీవలే ఆయన కొత్తగా ఓ యూట్యూబ్ ఛానెల్ పెట్టి ఏపీ రాజకీయలపై కామెంట్స్ చేస్తున్నారు. ఏపీ మంత్రి నారా లోకేష్, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌లపై కామెంట్స్ చేస్తు వీడియోలను విడుదల చేశారు నాగబాబు. తాజాగా ఆయన మరో వీడియోను విడుదల చేశారు.
ఈసారి ఏకంగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుపై సెటైరికల్ కామెంట్స్ చేశారు. గతంలో చంద్రబాబు అసెంబ్లీలో మాట్లాడిన దానిపై నాగబాబు తన వీడియోలో స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌ను అవినీతిలో కాని , అభివృద్ధిలో కాని నెంబర్ వన్ ప్లేస్‌లో నిలబెడతానని చంద్రబాబు మాట్లాడారు. దీనిపై నాగబాబు తన వీడియోలో స్పందిస్తు అభివృద్ది అనేది అబద్దం అని, అవినీతి అనేది మాత్రం నిజం అని చెప్పుకొచ్చారు. మీలా నిజాయితీగా ఉండే నాయకులు మాకు కావలంటు ఆయన చంద్రబాబుకు ఓ థమ్సప్ అని తన వీడియోను ముగించారు.
ఇప్పటికే లోకేష్,జగన్‌లు కెలికిన నాగబాబు,ఇప్పుడు ముఖ్యమంత్రిని సైతం తన వీడియాలో సెటైరికల్‌గా విమర్శలు చేశారు. ఈ వీడియో చూసిన వారు తరువాత వీడియో పవన్ మీదే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సెంటు భూమిలో పవన్ పంట పండించారని చెప్పుకొచ్చిన వీడియోను దీనికి యాడ్ చేస్తున్నారు ప్రత్యర్థి పార్టీ వారు. మరి దీనికి నాగబాబు ఎలా స్పందిస్తారో చూడాలి.
- ఏపీ పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం
- కోమటిరెడ్డి..భోళా మనిషి!
- హైదరాబాద్ మెట్రో ఛార్జీల పెంపు
- ఏపీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ పోస్టులకు నోటిఫికేషన్
- రైతులకు గుడ్‌న్యూస్.. ‘ఫార్మర్ ఐడీ’