Saturday, May 3, 2025
- Advertisement -

చిరంజీవిని సందిగ్దంలో పడేశారు

- Advertisement -

మెగస్టార్ చిరంజీవి కి సరికొత్త సమస్య వచ్చిపడింది.అదేంటో కాదు తమిళనాడు సినీ పరిశ్రమకు ఎంతో ప్రెస్టీజియస్ గా భావించే నడిగర్ సంఘం ఎన్నికలు.

ఈసారి ఈ ఎన్నికల్లో శరత్ కుమార్ ,నాజర్ లు ప్రెసిడెంట్ పోస్ట్ కు  పోటీ పడుతున్నారు. నాజర్ వర్గానికి ముందునుంచి మన నెల్లూరు రెడ్డిగారైనటువంటి విశాల్…. అండదండలు అందిస్తూ ఉన్నాడు. అందుకే అతను జనరల్ సెక్రటరీ పోస్ట్ పై కన్నేశాడు.హీరో కార్తి ట్రెజరర్ పోస్ట్ కోసం ఆశపడుతున్నాడు.

వీరంతా నాజర్ ప్యానల్ నుంచి ట్రై చేస్తున్నవారు.అయితే నడిగర్ సంఘంలో దాదాపు 3500 మంది సభ్యులుగా ఉన్నారు. అందుల్లో  500 మంది  తెలుగువారికి సభ్యత్వం ఉంది. సో…. ఆ యాంగిల్లో ఆలోచించిన విశాల్… చిరును సంప్రదించి ఆయన మద్దతు తీసుకోవాలని చూస్తున్నాడు. ఎందుకంటే చిరు వర్గం మద్దతుతోనే రాజేంద్రుడు మా అధ్యక్షుడిగా గెలిచాడు. అదే రీతిలో తమకు ఛాన్స్ ఇస్తే….గెలిస్తామని విశాల్ అండ్ టీం బావిస్తోంది.

ఐతే ఇక్కడో సమస్య ఉంది. విశాల్ టీం కు సవాల్ చేస్తోన్న శరత్ కుమార్ కు కూడా…. మెగా స్టార్ తో రెండు దశాబ్దాల స్నేహముంది.అతని వైఫ్ రాధిక చిరుకు చాలా క్లోజ్ .ఆ విధంగా చూసినపుడు విశాల్ కు చిరు మద్దతిస్తాడని అనుకోలేం. అలా అని చెప్పి చిరు శరత్ కుమార్ కు మద్దతిస్తాడని చెప్పలేం.అలా ఇస్తే తెలుగోడికి అన్యాయం చేసాడని కొంతమంది పనిగట్టుకుని మరీ ప్రచారం చేస్తారు. అందుకే చిరంజీవి అటు శరత్ కుమార్ మద్దతివ్వలేక మన రెడ్డిగారి నెత్తి మీద పెట్టుకోలేక ఇబ్బంది పడుతున్నాడని పరిశ్రమలో చెప్పుకుంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -