మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సైరా సినిమాతో బిజీగా ఉన్నాడు. ఊయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను రామ్ చరణ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్‌గా నయనతార నటిస్తోంది. గ్రాఫిక్స్ పెద్ద పీట వేసి మరి ఈ సినిమాను నిర్మించడంతో షూటింగ్ ఆలస్యం అవుతుందని తెలుస్తుంది. ఈ సినిమా పూర్తి అవ్వగానే కొరటాల శివ,త్రివిక్రమ్‌ల సినిమాలలో నటించనున్నాడు. అయిదే మొదట కొరటాల శివతోనే సినిమా చేయనున్నాడు చిరు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆప్డేట్ ఒకటి బయటికి వచ్చింది. ఈ సినిమాలో హీరోయిన్‌గా తమన్నాను తీసుకోనున్నారని సమాచారం.
శివ అనుకుంటున్న క్యారెక్టర్‌కు తమన్నా అయితేనే న్యాయం చేస్తుందని ,అందుకే ఈ సినిమాలో హీరోయిన్‌గా తమన్నాను ఎంపిక చేశారని తెలుస్తోంది. ఈ వార్తే నిజం అయితే కనుకుతమన్నా అటు కొడుకుతో ఇటు తండ్రితో కలిసి సినిమాలు చేసిన ఘనత తమన్నాకు దక్కుతుంది. రామ్ చరణ్‌తో కలిసి తమన్నా రచ్చ సినిమాలో నటించింది. తమన్నా వరుసగా సీనియర్ హీరోలతో సినిమాలు చేస్తోంది. ఇటీవలే వెంకీకి జోడిగా ఎఫ్ 2 కనిపించింది. ఈ సినిమా సంక్రాంతికి విడుదలై సూపర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. మళ్లీ ఇప్పుడు మెగాస్టార్ సరసన హీరోయిన్‌గా చేస్తోంది తమన్నా.ఇక సినిమాలో నయనతార కూడా మరో హీరోయిన్‌గా నటిస్తుందని ఇండస్ట్రీ వర్గాల వినికిడి.
- ఏపీ పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం
- కోమటిరెడ్డి..భోళా మనిషి!
- హైదరాబాద్ మెట్రో ఛార్జీల పెంపు
- ఏపీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ పోస్టులకు నోటిఫికేషన్
- రైతులకు గుడ్‌న్యూస్.. ‘ఫార్మర్ ఐడీ’