Tuesday, May 6, 2025
- Advertisement -

నా ఫేవరేట్ హీరో తారక్:రాజమౌళి

- Advertisement -

దర్శకధీరుడు రాజమౌళి ఏం చేసిన సంచలనమే అవుతుంది. రీసెంట్ గా రాజమౌళి ఐఐటీ మద్రాస్  వెళ్ళి అక్కడి విద్యార్ధులతో కాసేపు ముచ్చటించారు. అక్కడి విద్యార్ధులు వివిధ ప్రశ్నలకు రాజమౌళి సమాధానాలు చెప్పాడు. ఐతే రాజమౌళిని ఒక ఆసక్తికరమైన ప్రశ్న అడిగారు. 

మీ ఫేవరేట్ హీరో ఎవరు? అని అక్కడి విద్యార్ధులు ప్రశ్నించగా..  ఆ ప్రశ్న కి రాజమౌళి వేంటనే “నా  ఫేవరేట్ హీరో తారక్” అంటూ సమాధానం ఇచ్చాడు. 

ఎన్టీఆర్  అంటే ఇష్టం కాబట్టే ఎన్టీఆర్ తో మూడు సినిమాలు ఎన్టీఆర్ కి భారీ హిట్లు ఇచ్చారు రాజమౌళి అని అనుకుంటున్నారు. రాజమౌళి  తన ఫేవరేట్ హీరో తారకే అని ప్రకటించడంతో అక్కడ ఉన్న ఎన్టీఆర్ అభిమానులు  ‘జై ఎన్టీఆర్’ అంటూ నినాదాలు చేశారు.

ఇంతకు ముందుకే రాజమౌళి, ఎన్టీఆర్ చాలా హార్డ్ వర్క్ చేస్తాడు అని డైలాగ్ డెలివరీలోనూ, యాక్టింగ్ లోనూ ఎన్టీఆర్ సూపర్ అని ఇంతకు ముందుకే చెప్పారు రాజమౌళి. మొత్తానికి రాజమౌళి ఫేవరేట్ హీరో తారక్ అనమాట.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -