Monday, May 5, 2025
- Advertisement -

స్వీడ‌న్ మోడ‌ల్‌తో రొమాన్స్ త‌ర్వాత బ‌న్నీఅమెరికాకు

- Advertisement -

స్టైలిశ్‌ స్టార్ అల్లు అర్జున్ వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వంలో ‘నా పేరు సూర్య‌.. నా ఇల్లు ఇండియా’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్త‌య్యింది. ఒక్క పాట మిన‌హా సినిమా మొత్తం పూర్త‌యిన‌ట్టే. సైనిక నేప‌థ్యంలో రూపొందించే ఈ సినిమాలో బ‌న్నీ సైనికుడిగా క‌నిపిస్తున్నాడు.

ఇప్పుడు ఈ సినిమా పాటల షూటింగ్‌ మాత్రమే ఉంది. ఈ సినిమాలో ఓ పాట కోసం స్వీడ‌న్ భామ‌తో క‌లిసి బ‌న్నీ అమెరికా వెళ్ల‌నున్నాడు. ఓ పాట షూటింగ్ కోసం సినిమా బృందం అమెరికాకు వెళ్లనుందట. ప్రస్తుతం స్వీడన్ మోడల్ ఎల్లి ఈవ్రమన్ స్పెషల్ సాంగ్ చిత్రీకరణ హైదరాబాద్‌లో షూటింగ్ జరుగుతోంది. దాదాపు ఆ సాంగ్ కూడా పూర్త‌వుతోంది. ఆ వర్క్ ఫినిష్ అవ్వగానే హీరో అల్లు అర్జున్ హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ మధ్య ఒక రొమాంటిక్ పాట కోసం అమెరికా వెళ్ల‌నున్నారు.

అమెరికాలోని అద్భుత‌మైన సీనిరీస్ మ‌ధ్య‌లో ఈ పాట‌ను తెర‌కెక్కించ‌నున్నారు. ఆ పాట షూట్ అనంతరం హైదరాబాద్‌కు చేరుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేయ‌నున్నారు. లగడపాటి శ్రీధర్, నాగబాబు నిర్మాణంలో రూపొందిస్తున్న ఈ సినిమా మే 4వ తేదీన విడుద‌ల చేయ‌నున్నారు.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -