సైనిక నేపథ్యంలో రూపొందిస్తున్న సినిమా ‘నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా’. సైనికుడి పాత్రలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కనిపిస్తున్నాడు. ఈ సినిమాపై ప్రేక్షకులు, అభిమానులు భారీ అంచనాలతో ఎదురుచూస్తున్నారు. రచయిత వక్కంతం వంశీ దర్శకుడిగా ఈ సినిమనా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది.
దేశ సరిహద్దులో తీసిన సైనిక విన్యాసాలు, హీరోయిన్‌తో రొమాన్స్ తదితర సీన్స్‌తో ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. ఔట్ డోర్ వర్క్ మొత్తం అయిపోయి ఇప్పుడు ప్రీ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయి. త్వరలో ఆ పనులు పూర్తిచేసి సినిమాకు విడుదలకు వారం ముందే సినిమాను సిద్ధం చేయాలనే ఆలోచనలో ఉన్నారు.మధుర శ్రీధర్ – నాగేంద్ర బాబు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో అర్జున్ పక్కన అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్గా ఉంది. ఏప్రిల్ మొదటివారం సినిమా చేయనున్నారు.