మెగా బ్రదర్ నాగబాబు ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్న సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితం టీడీపీ ఎమ్మెల్యే, హీరో అయిన బాలకృష్ణపై రెచ్చిపోయారు నాగబాబు. గతంలో తమ కుటుంబంపై బాలకృష్ణ చేసిన కామెంట్స్‌కు కౌంటర్ ఇస్తు వరుస వీడియోను విడుదల చేశారు నాగబాబు. ఈ వీడియోలలో బాలకృష్ణను టార్గెట్ చేసుకుని కామోంట్స్ చేసిన నాగబాబు , మరోసారి తన నోటికి పని చెప్పారు. కొత్తగా ఓ ఛానెల్‌ను పెట్టి తాను ఇక మీద రాజకీయ విమర్శలు చేస్తానని ప్రకటించారు నాగబాబు.
గతంలో బాలయ్యను టార్గెట్ చేసుకున్న నాగబాబు తాజాగా ఆయన అల్లుడు ,ఏపీ మంత్రి నారా లోకేశ్‌ను టార్గెట్ చేసుకున్నాడు. 2014 ఎన్నికల సమయంలో నారా లోకేశ్ మాట్లాడిన కొన్ని వ్యాఖ్యలను గుర్తు చేస్తు….కుల పిచ్చి,బంధుప్రీతి,మత పిచ్చి, రాష్ట్రంలో ఏదైన ఉందంటే అది టీడీపీ పార్టీకే అని అంటూ లోకేశ్ పొరపాటున మాట్లాడిన వ్యాఖ్యలను తన వీడియోలో ప్రస్తావించారు నాగబాబు. మీ గురించి , మీ పార్టీ గురించి నిజాలు చెప్పింనందుకు మీకు ధన్యవాదాలు లోకేశ్ గారు అని చెప్పారు.
ఇంత నిజాయితీగా ఉండటం మీకు తప్ప ఎవ్వరికి సాధ్యం కాదని, మీలా నిజాయితీగా ఉండంటం దేశంలో మరో నాయకుడు వల్ల కాదని లోకేశ్‌కు కితాబునిచ్చిరు నాగబాబు. ఇప్పటికే మెగా, నందమూరిగా మారిన ఈ యుద్దాన్ని, తాజాగా పొలిటికల్ సైడ్‌కు కూడా తీసుకువెళ్లారు నాగబాబు. మరి దీనిపై టీడీపీ శ్రేణులు ఎలా స్పందిస్తాయో చూడాలి.
- హైదరాబాద్ మెట్రో ఛార్జీల పెంపు
- ఏపీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ పోస్టులకు నోటిఫికేషన్
- రైతులకు గుడ్‌న్యూస్.. ‘ఫార్మర్ ఐడీ’
- ప్రియుడితో డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల!
- అమరావతికి మోదీ..5 లక్షల మందితో సభ