నటుడు పవన్ కల్యాణ్ జనసేన పార్టీకి ఎవరు విరాళాలు ఇచ్చిన , ఇవ్వకపోయిన వారి కుటుంబ సభ్యులు మాత్రం విరాళాలు ప్రకటిస్తు తాము అంత ఒక్కటే అనే చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా పవన్ పార్టీకి ఆయన మెగా కుటుంబం నుంచి విరాళం అందింది. అన్ని పార్టీల కంటే తక్కువ స్థాయిలో ఉన్న జనసేనకు మెగా యువ హీరోలు విరాళాలిస్తూ పవన్ కు తోడుగా నిలుస్తున్నారు. జనసేన పార్టీకి వరుణ్ తేజ్ కోటి రూపాయలు అలాగే నాగబాబు 25 లక్షల రూపాయలు విరాళాలు ఇచ్చినట్లు పవన్ ఓ లేఖను మీడియాకు విడుదల చేశారు.
ఈ సహాయం తనకు ఒక క్రిస్టమస్ గిఫ్ట్ లాంటిదని ఇద్దరికి కృతజ్ఞతలు తెలిపారు. ఇక సమయం చూసుకొని తప్పకుండా వారిని కలుస్తాను అని పవన్ ట్విట్టర్ లో పేర్కొన్నారు. పవన్‌కు తన పెద్ద అన్నయ్య చిరు సపోర్టు లేకపోయినప్పటికి , తన రెండో అన్నయ్య నాగబాబు మాత్రం పవన్‌కు అన్ని సమయాలలో తోడుగా నిలుస్తు వస్తున్నాడు.
- హైదరాబాద్ మెట్రో ఛార్జీల పెంపు
- ఏపీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ పోస్టులకు నోటిఫికేషన్
- రైతులకు గుడ్‌న్యూస్.. ‘ఫార్మర్ ఐడీ’
- ప్రియుడితో డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల!
- అమరావతికి మోదీ..5 లక్షల మందితో సభ