గత కొన్ని రోజులుగా క్యాస్టింగ్ కౌచ్ పై శ్రీరెడ్డి చేస్తున్న పోరాటంతో సినిమా ఇండస్ట్రీలో దుమారం రేపుతోంది. నిన్నటి వరకు శ్రీరెడ్డి చేసిన పోరాటం ఇప్పుడు పక్కదారి పట్టడంతో మద్దతుగా నిచిన వారందరూ ఇప్పుడు వ్యతిరేకంగా గళం విప్పితున్నారు. పవన్‌పై శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే లేపాయి. దీనిపై నాగబాబు స్పందించారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై కొందరు అనవసరంగా పని గట్టుకుని ఆరోపణలు చేస్తున్నారని, ఒకరి వ్యక్తిగత జీవితంలోకి ప్రవేశించే హక్కు వారికి ఎవరిచ్చారని నాగబాబు నిప్పులు చెరిగారు. పవన్ తప్పు చేస్తే ప్రజలముందు బహిరంగంగా చెప్పే దమ్మున్న మగాడా పవన్ అన్నారు. అలా చెప్పే ధైర్యం ఎవరికైనా ఉందాని ప్రశ్నించారు.
నా తమ్ముడు నాతో మాట్లాడి కనీసం ఆరు నెలలైంది. నేను డిస్టర్బ్ చేయడం లేదు. వెళ్లిపోయాడు ప్రజల్లోకి. కోట్ల రూపాయలు వచ్చే ఇక్కడే ఉండొచ్చుకదా? అంటే మా మాట కూడా వినిపించుకోకుండా వెళ్లిపోయాడు. వాడు నంబర్ వన్ స్టార్. వాడిని అంటారా? వాడిని తిడతారా? వాడిని విమర్శిస్తారా అంటూ మండిపడ్డారు. పొలిటికల్‌గా మిమర్శించుకోండి అంతే గాని వ్యక్తిగత విషయాల జోలికి వెల్లద్దని సూచించారు.
తప్పు చేయని మనిషి అంటూ భూమిపై ఎవరూ ఉండరని, వ్యక్తిగతంగా ఎవరిని తవ్వినా దొరుకుతారని, కావాల్సింది అది కాదని అన్నారు. పవన్ నిశ్శబ్దాన్ని చేతగానితనంగా అనుకోవద్దని హెచ్చరించారు. విమర్శలు చేస్తున్న వారి వెనక ఎవరున్నారో తమకు తెలుసునని, అందరి … తీరుస్తాడని అన్నారు. అతి త్వరలోనే ఇది జరుగుతుందని చెప్పారు.