ప్రముఖ గాయని సునీత-డిజిటల్ మీడియా అధినేత రామ్ వీరపనేని వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ అమ్మపల్లి సీతారాముల ఆలయంలో శనివారం రాత్రి వీరి పెళ్లి జరిగినట్లు తెలిసింది. సునీత పెళ్లికి పలువురు సినీ ప్రముఖులతో పాటు రాజకీయ ప్రముఖులు కూడా హాజరయ్యారు.

తాజాగా సింగర్ సునిత వైవాహిక జీవితంపై నటుడు నాగబాబు తనదైన శైలిలో స్పందించారు. ఆనందం అనేది పుట్టుకతో రాదని, దానిని మనం వెతికి అందుకోవాలని నాగబాబు ట్వీట్ చేశారు. రామ్, సునీత తమ సంతోషాలను అన్వేషించి గుర్తించినందుకు అభినందనలు చెబుతున్నానని అన్నారు.

మీరు ధైర్యంగా తీసుకున్న నిర్ణయం మీ జీవితాన్ని ఆనందమయం చేయాలని కోరుకుంటున్నా అన్నారు. ధైర్యంగా ముందడుగు వేయాలనుకునేవారికి వారి జంట ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. ప్రేమ, ఆనందం అనేవి ఎప్పటికీ వారి శాశ్వత చిరునామాగా మారాలని కోరుకుంటున్నానని చెబుతూ, వారికి వివాహ శుభాకాంక్షలు తెలిపారు.