మహనటుడు ఎన్టీఆర్ జీవిత కథను సినిమాగా తెరకెక్కించారు. ఈ సినిమాలో ఆయన పాత్రను బాలయ్య పోషిచండంతో సినిమాకు ప్లస్ పాయింట్ అయింది. నిన్ననే ఎన్టీఆర్ బయోపిక్‌లోని మొదటి పార్ట్ కథానాయకుడు విడుదలైంది. ఈ సినిమాకు అన్ని వైపుల నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది. బయోపిక్‌లోని సెకండ్ పార్ట్ మహనాయకుడు ఫిబ్రవరిలో విడుదల కానుంది. ఎన్టీఆర్ బయోపిక్ తీయడంతో ఆయన తరం హీరో అక్కినేని నాగేశ్వరరావు జీవిత కథను కూడా సినిమాగా బాగుంటుందనే వార్తలు వినిపించాయి.
ఈ దిశగా నాగర్జున కూడా బయోపిక్ గురించి ఆలోచిస్తున్నాడని సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్‌గా మారింది. తాజాగా అక్కినేని నాగేశ్వరరావు బయోపిక్‌పై స్పందించాడు నాగ్. నాన్నగారి జీవితం ఆనందంగా, ఆదర్శంగా,సాదా సీదాగా గడిచింది. ఆయన జీవితాన్ని సినిమాగా తెరకెక్కిస్తే ఎవరు చూడరని, ఎందుకంటే ఆయన జీవితంలో నెగిటివ్ షేడ్ లేదని ,మన వారికి నెగిటివ్ ఉంటేనే సినిమా నచ్చుతుందని చెప్పుకొచ్చాడు. నాన్నగారి జీవితాన్ని సినిమాగా తీయనని తేల్చి చేప్పేశాడు నాగ్.ఇక్కడ వరకు బాగానే ఉంది కాని, అక్కినేని బయోపిక్ తీయడం లేదంటే బాగుండేది.
ఇక్కడ అక్కినేని జీవితంలో నెగిటివ్ లేదని చెప్పడానికి ఎన్టీఆర్ బయోపిక్‌ను వాడుకున్నాడు నాగర్జున. ఎన్టీఆర్ జీవితంలో చాలా నెగిటివ్ ఉందని ఇన్‌డైరెక్ట్‌గా చెప్పాడు . గత కొద్ది రోజుల నుంచి బాలయ్య, నాగ్‌ల మధ్య సరైన సంబంధాలు లేవని తెలుస్తోంది. దీంతోనే నాగ్ ఇలాంటి కామెంట్స్ చేశాడని అంటున్నారు ఇండస్ట్రీ వారు. ఏది ఏమైనప్పటికి అక్కినేని బయోపిక్ రావడం లేదని స్పష్టం చేశాడు నాగర్జున .
- హైదరాబాద్ మెట్రో ఛార్జీల పెంపు
- ఏపీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ పోస్టులకు నోటిఫికేషన్
- రైతులకు గుడ్‌న్యూస్.. ‘ఫార్మర్ ఐడీ’
- ప్రియుడితో డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల!
- అమరావతికి మోదీ..5 లక్షల మందితో సభ