అతిపెద్ద రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు లో నాలుగో సీజన్ ప్రారంభమై 10 వారంలోకి వచ్చెసింది. తమిళ్‌లో నాల్గో సీజన్ ఇటీవలే ప్రారంభమైంది. తెలుగు బిగ్ బాస్ కు హోస్ట్ గా నాగార్జున వ్యవహరిస్తుండగా… తమిళ్‌లో కమల్ హాసన్ హోస్ట్‌గా ఉన్న విషయం తెలిసిందే. ఒకప్పుడు తెలుగు తమిళ్ ప్రజలు కలిసే ఉండేవారు.. తెలుగు తమిళ భాషలు ప్రాంతాలు, మనుషుల మద్య అవినాభావ సంబంధం ఉంది… సంప్రదాయాలు కూడా కలిసిపోతాయి.
సినిమా పరిశ్రమ హైద్రాబాద్‍కు రాకముందు మద్రాస్ కేద్రంగా ఉండేది. తెలుగు, తమిళ సినిమా పరిశ్రమకు విడదీయలేని అనుబంధం ఉంది. అయితే నేడు కమల్ హాసన్ బర్త్ డే సందర్భంగా బిగ్ బాస్ సరికొత్తగా ప్లాన్ చేస్తు.. తెలుగు, తమిళ రెండు బిగ్ బాస్ షోలను లింక్ చేశారు.
వర్చువల్‌గా తెలుగు, తమిళ బిగ్ బాస్ షోలను కలిపి చూపిస్తు హిస్టరీలోనే సరికొత్తగా ప్లాన్ చేశారు బిగ్ బాస్. ఇలా రెండు భాషల బిగ్ బాస్ షోలను ఒకేసారి చూసె అవకాశాన్ని కల్పించి తెలుగు, తమిళ ప్రక్షకులకు మరింత కనువిందు చేయనున్నారు బిగ్ బాస్.
రహస్యంగా పెళ్ళి చేసుకున్న సెలబ్రిటీలు వీళ్లే..!
మన స్టార్ హీరోయిన్స్ అసలు పేర్లు ఏంటో తెలుసా ?