Tuesday, May 6, 2025
- Advertisement -

బోయపాటి కి బాలయ్య చేసిన సూచన ఇదే

- Advertisement -

ఇప్పటికే నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వం లో సినిమా చేయడం లేదు అని అందరికీ తెలియవచ్చింది. ఎప్పుడెప్పుడు వీళ్లిద్దరూ మళ్లీ జత కడతారా అని ఎదురు చూసిన దర్శకనిర్మాతలకు చేదు అనుభవాలు మిగిలాయి అనుకోవచ్చు. బోయపాటి నీ కాదని బాలకృష్ణ కె స్ రవి కుమార్ దర్శకత్వం లో రూలర్ అనే చిత్రానికి ఓకే చేసినట్లు ఫిలిమ్ నగర్ సమాచారం.

అయితే తాజా పుకార్ల ప్రకారం బోయపాటి శ్రీను బాలకృష్ణ కోసం కథ సిద్దం చేస్తూనే ఉన్నాడట. మీడియా లో అనేక రూమర్స్ వచ్చినప్పటికీ బోయపాటి శ్రీను బాలకృష్ణ ప్రాజెక్ట్ కి మాత్రం ఎటువంటి అంతరాయం జరగట్లేదు అని తెలుస్తుంది. బోయపాటి చెప్పిన కథ స్పాన్ ఎక్కువ అవ్వడం , బడ్జెట్ ఎక్కువ అవ్వడం, చిత్రీకరణకు ఎక్కువ సమయం పడడం తో ప్రీ ప్రొడక్షన్ కి ఎక్కువ సమయం తీసుకోమని బాలకృష్ణ బోయపాటి కి సూచించారు అని తెలుస్తుంది. ఈ గ్యాప్ కవర్ చేయడానికి బాలకృష్ణ కె స్ రవి కుమార్ దర్శకత్వం లో ఒక సినిమా నీ చేయనున్నాడు. ఈ ఏడాది చివరి లోపు కె స్ రవి కుమార్ చిత్రాన్ని పూర్తి చేసి బాలకృష్ణ బోయపాటి సినిమా షూటింగ్ లో జాయిన్ అవ్వనున్నారు అని సమాచారం.

అన్ని అనుకున్నట్లు గా జరిగితే ఈ సినిమా యొక్క ప్రకటన త్వరలో వెల్లడవనున్నది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -