Wednesday, May 7, 2025
- Advertisement -

ఎన్టీఆర్ బయోపిక్ సినిమాను బాలయ్య ఆపేశాడా?

- Advertisement -

అత్యంత ప్రతిష్టాత్మకంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడి చేత ప్రారంభోత్సవం జరిపించుకున్న సినిమా ఎన్టీఆర్ బయోపిక్ ఆగిపోయిందా? వరుసగా జరుగుతున్న సంఘటనలను చెడ్డ సంకేతాలుగా తీసుకున్న బాలయ్య ఈ సినిమాను ఆపేశాడా? ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇదే చర్చ నడుస్తోంది. డైరెక్టర్‌గా తేజ తప్పుకోవడం…..వేరే ఏ డైరెక్టర్‌ని అడుగుతున్నా కూడా ఎవ్వరూ ఒప్పుకోకపోవడం తదితర కారణాలతో ఎన్టీఆర్ బయోపిక్‌ని బాలయ్య ఆపేశాడట.

అన్నింటికీ మించి మహానటి సినిమా రిలీజ్ అయ్యాక వచ్చిన కామెంట్స్ కూడా బాలయ్యను ఆలోచనలో పడేశాయి. మహానటి సావిత్రి జీవితకథను అజరామరం అనే స్థాయిలో తెరకెక్కించాడు నాగ్ అశ్విన్. ఇక ఇప్పుడు మహానటి ఎన్టీఆర్ ఆత్మకథకు కూడా అదే స్థాయిలో న్యాయం చేయలేకపోతే తీవ్ర విమర్శలు తప్పవు. ఇక ఎన్టీఆర్ బయోపిక్ కోసం కొంతమంది యంగ్ హీరోలను అడుగుతున్నప్పటికీ వాళ్ళెవరూ కూడా బాలయ్యకు ఎస్ చెప్పడం లేదు. డైరెక్టర్స్ కూడా ఈ సినిమాను డైరెక్ట్ చేయడానికి ముందుకు రావడం లేదు. సొంత దర్శకత్వంలోనే తెరకెక్కిస్తాను అని బాలయ్య పట్టుబట్టినప్పటికీ నందమూరి వారసులందరూ కూడా వద్దని చెప్పి బాలయ్యను వారించారు. ఇన్ని చికాకుల మధ్య ఈ సినిమాను తెరకెక్కించడం అవసరమా అన్న ఆలోచనలో బాలయ్య ఉన్నాడట. అయితే 2019 ఎన్నికలలో ఉపయోగపడేలా ఎలా అయినా సినిమాను తెరపైకి తీసుకురమ్మని చెప్పి నారా వారినుంచి ఒత్తిడి ఉందని తెలుస్తోంది. ఎన్టీఆర్ మరణం సమయంలో ఎన్టీఆర్‌కి అన్యాయం చేసి బాబు పంచన చేరిన బాలయ్య………ఇప్పుడు బయోపిక్ విషయంలో కూడా ‘మహానటి’ స్థాయిలో ప్లాన్ చేయకుండా బాబు రాజకీయ ప్రయోజనాల కోసం తెరకెక్కించి మరోసారి ఎన్టీఆర్ ఇమేజ్‌కి అన్యాయం చేస్తాడో లేదో చూడాలి మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -