Wednesday, May 7, 2025
- Advertisement -

వారం మ‌ధ్య‌లోనే నాని.. హౌస్‌మెట్స్‌కి గ‌ట్టి వార్నింగ్‌

- Advertisement -

బిగ్‌బాస్ రెండో సీజ‌న్ ముగింపు ద‌శ‌కు చేరుకుంది.ఇప్ప‌టికే 100 వంద రోజులు పూర్తి చేసుకున్న బిగ్‌బాస్ రెండో సీజ‌న్ ఈ వారంతో ముగియ‌నుంది.16 మంది స‌భ్యుల‌తో మొద‌లైన ఈ షో చివ‌రికి ఆరుగురు మాత్ర‌మే మిగిలారు.బిగ్‌బాస్ మొద‌టి సీజ‌న్‌తో పోలిస్తే రెండో సీజ‌న్ విభిన్నంగా న‌డిచిందని చెప్పాలి.రెండో సీజ‌న్ మొద‌టి నుంచి హాట్ హాట్‌గానే జ‌రుగుతుంది.హౌస్‌లో నిత్యం గొడ‌వ‌లు జ‌రుగుతునే ఉన్నాయి.ఇంటి సభ్యులు చాలా హుందాగా ప్రవర్తించాల్సింది పోయి త‌మ‌లో తాము గొడ‌వ‌లు ప‌డుతు ప్రేక్ష‌కుల‌కు చికాకు తెప్పించారు.

కౌశల్, తనీష్, గీతా మాధురిల గొడవలు తారా స్థాయికి చేరాయి.శ‌ని,ఆదివారాల‌లో వ‌చ్చే బిగ్‌బాస్‌ హౌస్ట్ నాని వీరికి క్లాస్ పీకుతునే ఉన్నాడు ,కాని వీరిలో మార్పు మాత్రం క‌నిపించ‌డం లేదు.షో మొద‌టి నుంచి తోటి హౌస్‌మెట్స్ అంద‌రు కౌశ‌ల్‌ను టార్గెట్ చేయ‌డం చూస్తునే ఉన్నాం.తాజాగా మంగ‌ళ‌వారం జ‌రిగిన ఎపిసోడ్‌లో కూడా సేమ్ సీన్ రిపీట్ కావ‌డంతో బిగ్‌బాస్ వారిని హెచ్చ‌రించారు.అయిన‌ప్ప‌టికి వారు గొడ‌వ‌ల‌ను వ్య‌క్త‌గ‌తంగా తీసుకోవ‌డంతో బిగ్‌బాస్ ఏకంగా టాస్క్‌ను మ‌ధ్య‌లో అపేయాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది.ఇక ఈ రోజు(బుధ‌వారం) జ‌రిగే ఎపిసోడ్ ప్రోమోని విడుద‌ల చేశారు బిగ్‌బాస్‌. కౌశల్ తన మీద అందరు ఎటాక్ చేస్తున్న విధానాన్ని చెబుతూ తన దగ్గరకు వచ్చే సరికి అందరు కుక్కల్లా మీద పడతారని అన్నాడు. కుక్కల్లా అనేసరికి హౌస్‌లో ఉన్న మిగతా ఇంటి సభ్యులు ఫైర్ అవుతున్నారు.

అప్పటికే రోజు గొడవలతో హాట్ హాట్ గా నడుస్తున్న షో మరింత రచ్చ రచ్చ సాగ‌నుంది.ఈ గొడ‌వ పెద్ద‌ది కావ‌డంతో వారంతంలో వ‌చ్చే నాని వారం మ‌ధ్య‌లోనే రావ‌ల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది.నాని బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లి మ‌రి ఇంటి స‌భ్యుల‌కు గ‌ట్టి క్లాస్ పీక‌డ‌ని తెలుస్తుంది.మీరు ఒక్క‌రిక్క‌రు కుక్క‌లు అనుకోవ‌డం కాదు ,చూసే జ‌నాల‌కు మీరు నిజంగానే కుక్క‌ల్లా గొడ‌వ‌లు ప‌డుతున్నారని, నాని వారికి గ‌ట్టి వార్నింగ్ ఇస్తాడ‌ని స‌మాచారం.మ‌రి నాని వ‌చ్చి ఇంటి స‌భ్యులకు వార్నింగ్ ఇచ్చింది టీవీలో ప్ర‌సారం చేస్తారో లేదో చూడాలి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -