టాలీవుడ్‌లో మరో విషాద ఘటన చోటు చేసుకుంది. తెలుగు ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నిర్మాత అనీల్ కుమార్ శుక్రవారం రాత్రి కన్నుమూశారు. రాధా గోపాలం, అల్లరి బుల్లోడు, శ్రీరామ చంద్రులు, ఒట్టేసి చెబుతున్నా వంటి సూపర్ హిట్ చిత్రాలకు అనీల్ నిర్మాతగా వ్యవహరించారు. అనీల్ కుమార్ కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నట్లు సమాచారం. ఆయన హైదరాబాద్‌లోని స్టార్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన మృతిపై న్యాచురల్ స్టార్ నాని ట్విట్ చేశారు.
అనీల్ కుమార్ మృతి పట్ల సంతాపం తెలియజేస్తూ, ఆయనతో తనకు ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. నాని అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసింది అనీల్ కుమార్ దగ్గరేనట. ఆయన దగ్గర నుంచే తన తొలి జీతం అందుకున్నట్లు వెల్లడించాడు నాని. నా తొలి నిర్మాత, నా ఫ్యామిలీ, నా మెంటర్. ఆయనని మనల్ని వదిలి వెళ్లడం బాధగా ఉంది. ఆయన ఆత్మకి శాంతి కలగాలని ప్రార్ధిస్తున్నాను అని ట్విట్‌లో నాని పేర్కొన్నారు. అల్లరి నరేష్‌తో పాటు పలవురు సినీ ప్రముఖులు కూడా అనీల్ కుమార్ మృతికి సంతాపం తెలిపారు.
- Advertisement -
నాని తొలి నిర్మాత మృతి
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -