టాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది సమంత. తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా క్రేజ్ సంపాదించుకుంది. టాలీవుడ్ టాప్ హీరోలందరితో సినిమాలు చేసింది. తమిళంలో కూడా తన సత్తాను చాటింది. హీరో అక్కినేని నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది ఈ భామ. పెళ్లి తరువాత కూడా సినిమాలలో నటిస్తు తన హావాను కొనసాగిస్తోంది. పెళ్లి తరువాత సమంత నటించిన సినిమాలు అన్ని సూపర్ హిట్లు కావడంతో ఈ భామకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది.అయితే తాజాగా సమంత చేసిన పనికి నెటిజన్లు ఆమెను ట్రోల్ చేస్తున్నారు. సమంత హీరోయిన్‌గా చేస్తునే కొన్ని కంపెనీలకు బ్రాండ్ అంబసీడర్‌గా వ్యవహారిస్తోంది.
సమంత తాజాగా ‘కుర్ కురే’ ప్రొడక్ట్ కి బ్రాండ్ అంబాసిడర్ వ్యవహరిస్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే ఈవిషయంలోనే నెటిజన్లు సమంతను ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. ఇది ఆరోగ్యానికి హానికరమైన ప్రొడక్ట్ అని దయచేసి ఇలాంటి వాటికి సపోర్ట్ చేయొద్దని ట్వీట్ లు పెడుతున్నారు. కొందరు సమంతను రిక్వెస్ట్ చేస్తుంటే.. మరికొందరు మాత్రం పరుష పదజాలంతో ఆమెని తిడుతున్నారు. డబ్బు కోసం ఇలా దిగజారాలా అంటూ వారు కామెంట్స్ చేస్తున్నారు. గతంలో మంచు లక్ష్మీ కూడా ఇలానే ‘కుర్ కురే’కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించి విమర్శలు ఎదుర్కొంది.
- Advertisement -
డబ్బు కోసం ఇంత దిగజారాలా సమంత..?
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -