Monday, May 5, 2025
- Advertisement -

ఫ‌స్ట్‌లుక్‌ల‌తో న్యూ ఇయ‌ర్

- Advertisement -

ఐదారు సినిమాల ఫ‌స్ట్‌లుక్‌లు విడుద‌ల‌

కొత్త సంవ‌త్స‌రం సంద‌ర్భంగా ప్రేక్ష‌కులు, అభిమానుల‌కు తెలుగు సినీ ప‌రిశ్ర‌మ సంద‌డి తెచ్చింది. సినిమా విడుద‌ల కావాల్సిన స‌మ‌యం చాలా దూరం ఉండ‌డంతో ప్రేక్ష‌కుల నోళ్ల‌ల్లో నానేందుకు ప్ర‌చార కార్య‌క్ర‌మాలు ఎంతో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. అందులో భాగంగా ఫ‌స్ట్‌లుక్ అనేది ప్ర‌థ‌మంగా విడుద‌ల చేసే ప్ర‌చార కార్య‌క్ర‌మం. ఈ విధంగా జ‌న‌వ‌రి 1, 2018 కొత్త సంవ‌త్స‌రం సంద‌ర్భంగా ప‌లు సినిమాల ఫ‌స్ట్‌లుక్‌లు విడుద‌ల‌య్యాయి.

దగ్గుబాటి రానా ఏ పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోతారనడానికి ఈ ఫొటోనే నిదర్శనం. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘హాథీ మేరే సాథీ’. 1971లో హిందీలో ఇదే టైటిల్‌తో వచ్చిన సినిమాకు ఇది రీమేక్‌గా రాబోతోంది. నూతన సంవత్సరం‌ సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను చిత్ర బృందం ఈరోజు విడుదల చేసింది.

బాందేవ్‌
రాజేశ్‌ ఖన్నా హీరోగా 1971లో బాలీవుడ్‌లో విడుద‌లైన హాథీ మేరి సాథీ సినిమా సూప‌ర్‌హిట్‌గా నిలిచింది. ఈ సినిమాను రీమేక్ చేస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో తీస్తున్నారు. కొత్త సంవ‌త్స‌రం సంద‌ర్భంగా ఈ సినిమా టైటిల్‌, ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల చేశారు. బాందేవ్ టైటిల్ ఫిక్స్ చేయ‌గా.. రానా ఏనుగు తొండాన్ని పట్టుకుని నిలబడిన స్టిల్ విడుద‌ల చేశారు. రానా బాందేవ్‌ పాత్రలో నటిస్తున్నారు. ప్రభు సొలోమాన్ దర్శకత్వంలో ఈ సినిమా వ‌స్తోంది. వీటితో పాటు రానా‘1948’ చిత్రంతో బిజీగా ఉన్నారు. మలయాళంలో ‘రాజా మార్తాండ వర్మ’ అనే చారిత్రాత్మక సినిమాల్లో న‌టిస్తున్నారు.

‘భాగమతి’
బాహుబ‌లిలో దేవ‌సేన‌గా ఆక‌ట్టుకున్న అనుష్క ప్ర‌స్తుతం చేస్తున్న సినిమా ‘భాగమతి’. అశోక్‌ ఈ సినిమా దర్శకత్వంలో వ‌స్తున్న ఈ సినిమా టైటిల్ టీజ‌ర్‌ను ఇటీవ‌ల విడుద‌ల చేశారు. ఇప్పుడు కొత్త సంవ‌త్స‌రం సంద‌ర్భంగా ప్రత్యేక పోస్టర్‌ను విడుద‌ల చేశారు. అనుష్క ఓ పక్కకు చూస్తున్నట్లు పోస్ట‌ర్‌లో ఉంది.

‘గాయత్రి’
మంచు కుటుంబం అంతా న‌టిస్తున్నసినిమా ‘గాయత్రి’. ఈ సినిమాలో మోహన్‌బాబు ప్ర‌ధాన పాత్ర పోషిస్తున్నారు. ‘ఆ రోజుల్లో రాముడు చేసింది తప్పే అయితే నేను చేసింది కూడా తప్పే’ అనే క్యాప్షన్‌తో ఇటీవ‌ల మోహ‌న్‌బాబు లుక్ విడుద‌ల చేసిన సినిమా బృందం ఇప్పుడు మ‌రో స్టిల్‌ను విడుద‌ల చేసింది. గ‌ర్భిణిగా ఉన్న శ్రియకు జ‌ట్టు వేస్తూ.. నోట్లో దువ్వెన పెట్టుకుని మంచు విష్ణు క‌నిపించాడు. ‘ఇకపై ఇద్దరిదీ ఒకటే ప్రాణం’ అనే క్యాప్షన్ ఉంది.

‘తొలిప్రేమ’
ఫిదా సినిమాతో ఆక‌ట్టుకున్న వరుణ్‌ తేజ్ ప్ర‌స్తుతం ‘తొలిప్రేమ’ సినిమాలో న‌టిస్తున్నాడు. ఈ సినిమాలో వరుణ్‌, రాశీ ఇద్ద‌రూ ఒకరి కళ్లల్లోకి ఒకరు చూసుకోవడంతో ఉన్న‌ ఫ‌స్ట్‌లుక్‌ను చిత్రబృందం సోమవారం విడుదల చేసింది. వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 9వ తేదీన థియేట‌ర్ల‌లోకి రానుంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -