మెగా డాటర్, నాగబాబు గారాల పట్టి నిహారిక పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. వేద మంత్రాల నడుమ ఆమె మెడలో గుంటూరు ఐజీ జె. ప్రభాకర్ రావు కుమారుడు చైతన్య జొన్నగడ్డ మూడు ముళ్లు వేసి, ఏడడుగులు నడిచాడు. రాజస్తాన్‌లోని ఉదయ్ పూర్ ప్యాలెస్ ఈ వేడుకకు వేదికైంది. ముహూర్తం వేళ పెళ్లి కూతురు నిహారిక మెరూన్ కలర్ చీరలో మెరిసిపోయింది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు నూతన వధూవరులను ఆశీర్వదించారు.

ఈ నేపథ్యంలో నాగబాబు భావోద్వేగానికి లోనయ్యారు. ‘సరికొత్త జీవితం ఆరంభించబోతున్న నీకు శుభాకాంక్షలు. తను స్కూలుకు వెళ్లిన మొదటి రోజు నాకింకా గుర్తుంది. అప్పుడైతే సాయంత్రానికి ఇంటికి తిరిగి వచ్చేది. కానీ ఇప్పుడలా కాదు. నా చిన్నారి కూతురు స్కూలుకు వెళ్లేంత పెద్దదై పోయిందనే నిజం నమ్మడానికే నాకు చాలా ఏళ్లు పట్టింది. తనతో ఇరవై నాలుగు గంటలు ఆడుకోలేననే బాధ వెంటాడేది. ఇంకెన్నాళ్లు ఇలాంటి ఫీలింగ్ ఉంటుందో.. కాలమే నిర్ణయిస్తుంది’ అంటూ ఎమోషనల్ ట్వీట్ చేశారు.




Also Read: నిహారికకు చిరంజీవి ‘మెగా’ గిఫ్ట్.. ఖరీదు ఎంతో తెలుసా?


