మెగా డాటర్ నిహారిక హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి చాలాకాలం అయింది. అయితే నిహారికాకు కాలం కలిసి రావడం లేదు. తను నటించిన సినిమాలు అన్ని బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్‌గా నిలిచాయి. దీంతో ఎలగైన హిట్ కొట్టలనే కసితో మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిహారిక హీరోయిన్‌గా నటించిన సినిమా సూర్యకాంతం. టీజర్ , ట్రైలర్‌తో ఆకట్టుకున్న ఈ సినిమా ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రణీత్ బ్రమండపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమా నిహారికకు హిట్ ఇస్తుందో లేదో సమీక్ష ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

కథ :సూర్యకాంతం(నిహారిక) ఎప్పుడూ హైపర్ యాక్టీవ్‌గా ఉండే అమ్మాయి. ఇదే సమయంలో అభి(రాహుల్ విజయ్) అనే అబ్బాయితో ప్రేమలో ఉండగా తాను చివరి వరకు నిలదొక్కుకోలేననే భయంతో తానే దూరమవుతుంది. ఈ టైమ్‌లోనే అభికి పూజ(పేర్లెన్) తో నిశ్చితార్తం అవుతుంది. ఇక్కడే సూర్యకాంతం ఒక షాకింగ్ ట్విస్ట్ ఇస్తూ మళ్ళీ అభి జీవితంలోకి ఎంటర్ అవుతుంది. ఒకే సమయంలో అభి ఈ ఇద్దరినీ ఎలా హ్యాండిల్ చేసాడు? ముగ్గురి మధ్యలో ఉన్న విభేదాలు ఏర్పడడానికి గల అసలు కారణం ఏమిటి?. అభి జీవితంలోకి మళ్ళీ వచ్చిన నిహారిక అభిని దక్కించుకుందా లేదా అన్నది చూడాలంటే వెండి తెరపై చూడాల్సిందే.

విశ్లేషణ : దర్శకుడు ప్రణీత్ కి ఇది మొట్ట మొదటి సినిమాయే అయినప్పటికి సినిమాను బాగానే హ్యాండిల్ చేశాడు. ముగ్గురి మధ్యలో సాగే త్రిముఖ ప్రేమ కథను తెర మీద చక్కగా చూపించరనే చెప్పాలి. అలాగే తాను రాసుకున్న పాత్రలను అనుకున్నది అనుకున్నట్టు చూపించడంలో కూడా విజయం సాధించాడు దర్శకుడు. కథలో వచ్చే హాస్య సన్నివేశాలు నవ్వు తెప్పిస్తాయి.ఈ అన్నిటిలో దర్శకుడు మంచి మార్కులు సంపాదించాడని చెప్పొచ్చు.

నటీనటుల ఫర్మామెన్స్: నటీనటుల విషయానికి వచినట్టైతే సూర్యకాంతంగా నిహారిక తన పాత్రకి పూర్తి స్థాయి న్యాయం చేసిందనే చెప్పాలి. ఒక పక్క ఇన్నోసెంట్ గా కనిపించే సందర్భంలో చక్కగా సీరియస్ సన్నివేశాల్లో బాగా నటించింది. నిహారిక నటనలో పూర్తి పరిణితి కనిపించింది. అలాగే హాస్య సన్నివేశాలలో కూడా ఓ రేంజ్ పెర్ఫామెన్స్ చేసింది. అలాగే హీరో రాహుల్ విజయ్ కూడా తన నటనతో ఆకట్టుకుంటాడు. ఈ సినిమాలోనే ఉన్న మరో హీరోయిన్ పేర్లెన్ తన పాత్రకి తగ్గట్టుగా క్యూట్ గా మంచి నటన కనబర్చింది. వీరు తప్ప సినిమాలో చెప్పుకోవాడినికి పెద్ద క్యారెక్టర్లకు స్కోప్ లేదు.
బోటమ్ లైన్: ఓవరాల్‌గా నిహారిక మెప్పించింది.