తెలుగు సినిమా అంటే అందరికి మొదటిగా గుర్తుకు వచ్చే నటుడు నందమూరి తారక రామారావు. అటు సినీ ఇండస్ట్రీతో పాటు ,ఇటు రాజకీయాలలో తనదైన ముద్ర వేశారు ఎన్టీఆర్. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా పని చేశారు. ఎన్టీఆర్ సినీ, రాజకీయ జీవితాన్ని ఆధారంగా చేసుకోని సినిమాగా తెరకెక్కించారు ఆయన తనయుడు హీరో బాలకృష్ణ. సినిమాలో తండ్రి ఎన్టీఆర్ పాత్రను బాలయ్యే పోషించడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమాను రెండు భాగాలుగా తీశారు.
కథ నాయకుడు ,మహ నాయకుడు ఇలా పార్ట్‌లుగా సినిమాను తెరకెక్కించారు. మొదటి పార్ట్‌లో సినీ విశేషాలతో ,రెండో పార్ట్ రాజకీయానికి సంబంధించినది తెరకెక్కించారు. ఇక కథా నాయకుడు సినిమా టీజర్,ట్రైలర్, పోస్ట్‌ర్లకు మంచి స్పందన రావడంతో చిత్ర యూనిట్ ఆనందంలో ఉంది.క్రిష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా శనివారం సెన్సాన్ పూర్తి చేసుకుంది.సినిమాను ఎటువంటి కట్స్ లేకుండా క్లియరెన్స్ ఇచ్చింది సెన్సార్. గత రెండు రోజులుగా సినిమాలో ఇద్దరి క్యారెక్టర్లపై అనుమానం ఉందని, వారిని సినిమాలో నెగిటివ్‌గా చూపించారనే వార్తలు వచ్చాయి. మొదటి సినిమాను వారికి చూపించిన తరువాతే సినిమాను సెన్సార్‌కు పంపించాలనే మాటలు వినిపించాయి.
అయితే సినిమాలో ఎటువంటి వివాదాలకు తావు లేకుండా తెరకెక్కించాడట దర్శకుడు క్రిష్. ఇక సినిమాను చూసిన సెన్సార్ బోర్డు సభ్యులు సినిమా అద్భుతంగా తీశారని కితాబు ఇచ్చారని సమాచారం. ఎన్టీఆర్‌గా బాలయ్యగా బాగా నటించారని, బాలయ్య తప్ప మరో హీరోని ఈ సినిమాలో ఊహించుకోలేమని సెన్సార్ సభ్యులు తెలిపారట. విద్యా బాలన్‌తో హుందాగా నటించిన బాలయ్య, మరో పక్క ప్రణతి,హన్సిక,రకుల్ వంటి యంగ్ హీరోయిన్లతో పోటీపడి మరి డ్యాన్స్‌లు వేశారని సెన్సార్ సభ్యులలోని ఒకరు ఆద్యా మీడియాకు తెలిపారు.
సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తుందని , సినిమాకు క్రిష్ పడిన కష్టం తెర మీద కనిపిస్తుందని ఆ సభ్యుడు తెలిపాడు.సంక్రాంతి బరిలో నిలిచిన ఈ సినిమా జనవరి 9న విడుదల కానుంది. అసలే బాలయ్యకు సంక్రాంతి హీరోగా మంచి పేరు ఉండటంతో సినిమా ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు నందమూరి అభిమానులు.
- ప్రియుడితో డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల!
- అమరావతికి మోదీ..5 లక్షల మందితో సభ
- వైసీపీ నేత కేతిరెడ్డికి హైకోర్టులో ఊరట
- శ్రీవిష్ణు..వివాదానికి ఎండ్ కార్డు పడేనా?
- నగదు విత్ డ్రా చేస్తున్నారా…అయితే?