Monday, May 5, 2025
- Advertisement -

ఎన్టీఆర్ డెడికేషన్ చూసి కొరటాల షాక్!

- Advertisement -

టాలీవుడ్ లోఎలాంటి డైలాగ్స్ అయిన ఇట్టే చెప్పేయగల హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ కు డైలాగ్స్ మీద మంచి పట్టున్న విషయం అందరికి తెలిసిందే. సినిమా షూటింగ్ టైంలో తన డైలాగ్స్ తో అందరిని ఆశ్యర్యపరుస్తుంటాడు ఎన్టీఆర్. అలాగే ఆ సినిమాలకు సంబంధించి డబ్బింగ్ విషయంలోనూ ఇతర హీరోలకన్నా బెటర్ అని నిరూపించుకుంటాడు.

ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా జనతాగ్యారేజ్ అనే చిత్రం చేస్తున్నాడు. కొరటల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన సమంత, నిత్య మీనన్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అయితే ఈ చిత్ర షూటింగ్ దాదాపు పూర్తికావచ్చింది. అయితే ఈ చిత్రంలోని ఎన్టీఆర్ కి సంబంధించి డబ్బింగ్ చెప్పమని దర్శకుడు చెప్పాడట. దాంతో ముందుగా ఫస్టాఫ్ డబ్బింగ్ చెప్పాలని ఎన్టీఆర్ నిర్ణయం తీసుకున్నాడట.

కేవలం 6 గంటల సమయంలో ఫస్టాఫ్ డబ్బింగ్ మొత్తం చెప్పేసి అందరిని ఆశ్యర్యపరిచాడట. సాయంత్రానికి ఎంత వరకు చెప్పారు సార్ అని కొరటాల అడగ్గా మొత్తం కంప్లీట్ అయిపోయిందని చెప్పాడట ఎన్టీఆర్. దాంతో ఎన్టీఆర్ డెడికేషన్ చూసి కొరటాల షాక్ అయ్యాడట. ఇలాంటి మెమొరీ టైమింగ్ కొంతమందికి మాత్రమే ఉంటుందని ఎన్టీఆర్ ని మెచ్చుకున్నాడట కొరటాల.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -