యంగ్ టైగర్ ఎన్టీఆర్ షూటింగ్‌లో గాయపడినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో RRR (వర్కింగ్ టైటిల్) లో నటిస్తున్నాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్‌తో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతరామరాజుగా కనిపించనున్నాడు. ఇక సినిమా రెగ్యులర్ షూటింగ్ గత నెలలోనే ప్రారంభం అయింది. సినిమాలో ఓ ఫైట్ సన్నివేశాన్ని చిత్రికరిస్తుండగా ఎన్టీఆర్‌కు గాయం అయినట్లు వార్తలు వస్తున్నప్పటికి ,ఇందులో నిజం లేదని తెలుస్తోంది.
ఎన్టీఆర్‌కు ఇంటి దగ్గరే గాయం అయిందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అయితే ఈ విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. గాయం జరిగిన వెంటనే ఎన్టీఆర్‌ను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చేతికి చిన్న గాయం కావడంతో పెద్దగా అందోళన చెందాల్సిన పనిలేదని డాక్టర్లు చెప్పినట్లు తెలుస్తోంది. రెండు రోజులు విశ్రాంతి అనంతరం ఎన్టీఆర్ RRR షూటింగ్‌లో పాల్గొనున్నాడు. ఎన్టీఆర్ గాయం అయిందని తెలుసుకున్న ఎన్టీఆర్ అభిమానులు ఆయన తొందరగా కొలుకోవాలని సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు.
- Advertisement -
‘RRR’ షూటింగ్‌లో గాయపడిన ఎన్టీఆర్.. ఆస్పత్రికి తరలింపు
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -