స్టార్ హీరో సినిమా షూటింగ్ లోకల్ లో జరుగుతుందంటే.. అభిమానులు అక్కడ ఎగబడటం మనం ఇప్పటి వరకు చూస్తూనే ఉన్నాం. ఫోటోలు, ఆటోగ్రాఫ్స్ కోసం అభిమానులు షూటింగ్ సమయంలో భారీగా వస్తుంటారు. కానీ ఓ హీరో ఇప్పటివరకు వేళ్ళని చోట కూడా అదే స్థాయిలో భారీ ఎత్తున అభిమానులు వస్తే అతని క్రేజ్ పెరిగినట్లే కదా… ఎన్టీఆర్ కి ఇటువంటి క్రేజ్ వచ్చింది.
వరుసగా రెండు హీట్స్ అందుకొని ఫుల్ హ్యాపిగా ఉన్న ఎన్టీఆర్ తాజా సినిమా జనతా గ్యారేజ్ షూటింగ్ కోసం చెన్నై వెళ్ళిన విషయం తెలిసిందే. అయితే అక్కడ ఈ సినిమాకి సంబంధించి కొన్ని కీలక సన్నివేశాలు షూటింగ్ పూర్తి చేసుకొని తిరిగి హైదరాబాద్ చేరుకున్నాడు. కాగా చెన్నైలో భారీగా ఎన్టీఆర్ అభిమానులు షూటింగ్ స్పాట్ లో ఎగబడటంతో రోజుకి 3 గంటల చొప్పున ఫ్యాన్స్ కి ఫోటోలు దిగే అవకాశం ఇచ్చాడు ఎన్టీఆర్.
దాంతో 6 రోజుల షూటింగ్ లో ఏకంగా 5000 వేల మందికి పైగా ఫోటోలు దిగే అవకాశం ఇచ్చాడు ఎన్టీఆర్. ఇంకా చాలా మందికి ఫోటోలు దిగే అవకాశం దక్కకపోవడంతో నిరాశ చెందారట.